Ys Jagan : రెండోసారి అధికారంలోకి రావటానికి పక్కా స్కెచ్ రెడీ..!
Ys Jagan : వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో బలమైన ప్రతిపక్ష నేతగా ప్రజల తరఫున నిలబడటానికి, రెండో ప్రయత్నంలో అధికారంలోకి రావటానికి ముఖ్య కారణం ఆయన నిత్యం ప్రజల్లో ఉండటమే. రోజూ తమ కోసం పోరాడుతున్న నాయకుడికి ఒకసారి ముఖ్యమంత్రిగా ఛాన్స్ ఇస్తే పోలా అని పబ్లిక్ అనుకున్నారు. అధికారం చేతికి రావటమే తరువాయి సరికొత్త పాలనను ప్రజలకు అందిస్తున్నారు. ఈ క్రమంలో రెండేళ్లు గిర్రున తిరిగొచ్చాయి. కానీ ఈ రెండేళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనంలోకి వచ్చింది తక్కు
వనే చెప్పాలి. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్స్ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ Ys Jagan ఎక్కువ శాతం తాడేపల్లిగూడెంలోని తన క్యాంపు ఆఫీసుకే పరిమితమవుతున్నారు. డెవలప్మెంట్ కార్యక్రమాల ప్రారంభోత్సవాలైనా, అధికారులతో సమీక్షలైనా, నిధుల విడుదలైనా అన్నీ ఆన్ లైన్ లోనే చేసేస్తున్నారు.
Ys Jagan గ్యాప్ పెరుగుతోంది..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి Ys Jagan తరచూ ప్రజల్లోకి వస్తుంటే వాళ్ల సాధక బాధకాలు కొన్నైనా ప్రత్యక్షంగా తెలుస్తాయి. జిల్లాల పర్యటనలకు వెళితే ఆ కొన్ని చోట్లయినా అధికారులు హడావుడితో పనులు చేయిస్తారు. తద్వారా ప్రజలకు కొన్ని సమస్యలైనా తీరతాయి. ఆఫీసర్లు కూడా లైట్ తీసుకునే ఛాన్స్ ఉండదు. ఆన్ లైన్ లో ఫండ్స్ రిలీజ్ చేసినంత మాత్రాన క్షేత్ర స్థాయిలో అన్నీ చక్కబడవు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడితేనే సరిపోదు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ రెండింటికీ సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. సీఎం వైఎస్ జగన్ కి కూడా పబ్లిక్ లోకి రావాలని ఉంది కానీ కరోనా మహమ్మారి వ్యాప్తి వల్ల సాధ్యపడట్లేదు. అందరికీ వ్యాక్సిన్ వేసిన తర్వాతే ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన పెట్టుకోనున్నారు.
Ys Jagan ప్రతి ఊరికీ పలకరింపు..
రచ్చబండ పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిఊరికీ వచ్చి అక్కడి సమస్యలను అక్కడే పరిష్కరించాలనే ఆలోచనతో ఉన్నారు. కనీసం కొత్త సంవత్సరంలోనైనా ఈ పక్కా ప్లాన్ అమలవుతుందని ఆశిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు అప్పటికింకా రెండున్నర సంవత్సరాల కాలం అందుబాటులో ఉంటుంది. ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్ ని చూసిన జనం ముఖ్యమంత్రి హోదాలో ఇంకా ప్రత్యక్షంగా చూడలేదు. అప్పటికీ ఇప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హావభావాల్లో, మాటల్లో చెప్పుకోదగ్గ మార్పులు చోటుచేసుకుంటాయని అనుకుంటున్నారు.