YS Jagan : ఢిల్లీలో మోడీ జగన్ మీటింగ్.. మొహమాటం లేకుండా ఆ విషయం చెప్పిన జగన్

YS Jagan : సీఎం జగన్ ఉన్నపళంగా నిన్న సాయంత్రం స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.అమిత్ షా తెలంగాణకు వచ్చి మునుగోడు సభలో పాల్గొన్న టైంలో దేశరాజధానిలో ఒక్కసారిగా బాంబ్ పేలింది. బీజేపీ పశ్చిమ ఎంపీ ఒకరు లిక్కర్ స్కాం గురించి బయటపట్టారు. అందులో ఏపీ ప్రభుత్వానికి చెందిన రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, తెలంగాణకు చెందిన సీఎం కూతురు కవిత పేర్లు బయటకు వచ్చాయి.

YS Jagan : నిజంగా పోలవరమే టాపికా..

ఈ విషయం వెలుగులోకి వచ్చిన గంటల వ్యవధిలోనే జగన్ ఢిల్లీకి బయలు దేరి వెళ్లారని తెలిసింది. అంత సడన్‌గా ఎందుకు వెళ్లారని అంతా అనుమానం వ్యక్తం చేశారు. లిక్కర్ స్కాంలో ఏపీకి చెందిన వారి పేర్లు ప్రధానంగా వినిపించడంతో ఈ కేసు నుంచి బయటపడేయాలని ప్రధానిని కలిసి విన్నవించుకోవడానికే జగన్ వెళ్లారని ఏపీ ప్రతిపక్షం ఆరోపిస్తోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన మీడియా స్రవంతి ఈ స్కాంపై జోరుగా ప్రచారం చేస్తున్నాయి. అయితే, సోమవారం ప్రధాని మోదీతో సీఎం జగన్‌ భేటీ ముగిసింది. సీఎం వెంట ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్వాసితులకు పరిహారంపైనే ప్రధాన చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

Narendra Modi Jagan Meeting In Delhi Jagan Who Said That Matter Without Face

ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాలు, ముంపు మండలాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి పరిహారం అంశాన్ని ప్రధానితో చర్చించినట్టు వెల్లడించారు. వెంటనే సాయం చేయాలని కోరినట్టు వివరించారు. ఇదొక్కటే కాకుండా విభజన చట్టంలోని పెండింగ్‌ అంశాలు, పలు రాజకీయాంశాలపై కూడా చర్చ జరిగిందని సమాచారం. మరోవైపు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు.కేంద్రమంత్రి ఆర్కే సింగ్‌తో సమావేశమై తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన రూ.6వేల కోట్ల విద్యుత్ బకాయిలపై సీఎం జగన్ చర్చించినట్టు సమాచారం. కానీ విజయసాయిరెడ్డిని, ఏపీ పెద్దలను కాపాడేందుకే జగన్ ఢిల్లీ వెళ్లారని అంతా టాక్ వినిపిస్తోంది.

Recent Posts

Sand Mafia : కల్వచర్లలో మట్టి మాఫియా.. అర్థరాత్రి లారీలు, జేసీబీల‌ను అడ్డుకున్న స్థానిక ప్ర‌జ‌లు..!

Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…

20 minutes ago

Viral Video : కోడితో పిట్ట కొట్లాట.. ఈ పందెంలో ఎవరు గెలిచారో చూడండి..!

Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…

2 hours ago

Rashmika Mandanna : 10 ర‌ష్మిక‌- విజ‌య్ దేవ‌ర‌కొండ రిలేష‌న్ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన కింగ్‌డ‌మ్ నిర్మాత‌

Rashmika Mandanna :  చాలా రోజుల త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డ‌మ్ చిత్రం విజ‌య్‌కి బూస్ట‌ప్‌ని…

4 hours ago

Three MLAs : ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే ఛాన్స్..?

Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…

5 hours ago

Hero Vida : కేవలం రూ.45,000తో 142కి.మీ మైలేజ్‌.. రికార్డ్‌ స్థాయిలో అమ్మకాలు!

Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…

6 hours ago

PM Kisan : పీఎం కిసాన్ నిధులు విడుద‌ల‌.. రూ.2 వేలు ప‌డ్డాయా లేదా చెక్ చేసుకోండి..!

PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…

7 hours ago

Dharmasthala : ధర్మస్థలలో ఎక్కడ చూసిన మహిళల శవాలే.. అసలు ఏం జరిగింది..?

Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…

8 hours ago

Gudivada Amarnath : అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి చంద్రబాబు సింగపూర్ టూర్ : అమర్‌నాథ్

Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…

10 hours ago