Nagarjuna : తెలుగు బిగ్ బాస్ మరోసారి సందడి చేసేందుకు సిద్ధం అయ్యాడు. నాగార్జున పై ప్రోమో ఇప్పటికే వచ్చింది. రెండవ ప్రోమోను ఒకటి రెండు రోజుల్లో విడుదల చేసి షో ప్రారంభ తేదీని అధికారికంగా ప్రకటించబోతున్నారు. సెప్టెంబర్ మొదటి ఆదివారం ఎపిసోడ్ టెలికాస్ట్ ప్రారంభం అవ్వబోతుంది అంటూ ఇప్పటికే అధికారికంగా వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో బిగ్ బాస్ లో ఎంట్రీ ఇవ్వబోతున్న కంటెస్టెంట్స్ గురించి మరియు బిగ్ బాస్ కు వరుసగా నాల్గవ సారి హోస్టింగ్ చేయబోతున్న నాగార్జున పారితోషికం గురించి ఆసక్తికర చర్చ టాలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది.
నాగార్జున గత సీజన్ కు గాను 12 కోట్ల రూపాయల పారితోషికం ను బిగ్ బాస్ నిర్వాహకుల నుండి దక్కించుకున్నాడట. ఇప్పుడు ఆ మొత్తం ను 15 కోట్ల కు పెంచారు అంటూ వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నాగార్జున మరియు షో నిర్వాహకుల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం 15 కోట్లు మరియు లాభాల్లో కొంత మొత్తం వాటాగా ఆయన పారితోషికం అందుకుంటాడు అంటున్నారు. లాభాల్లో వాటా విషయం పక్కన పెడితే నాగార్జున ముందుగానే 15 కోట్ల రూపాయలను తన ఖాతాలో బిగ్ బాస్ పేరు మీద వేసుకోబోతున్నాడు.
షో కోసం నాగార్జున వారం లో కేవలం ఒక్క రోజు కేటాయించబోతున్నాడు. శని మరియు ఆది వారం ల యొక్క ఎపిసోడ్స్ కోసం నాగార్జున శనివారం మొత్తం ఎడు నుండి ఎనిమిది గంటల సమయం ను కేటాయిస్తాడు. అలా బిగ్ బాస్ కోసం అతి తక్కువ సమయం కేటాయించి ఏకంగా 15 కోట్ల పారితోషికం అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇక కంటెస్టెంట్స్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కంటెస్టెంట్స్ ఉదయభాను గా సమాచారం అందుతోంది. ఆమె వారం వారం కూడా పారితోషికం అందుకుంటుంది. దాదాపుగా అయిదు లక్షల వరకు ఆమె పారితోషికం ఉంటుందట.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.