YS Jagan : ఢిల్లీలో మోడీ జగన్ మీటింగ్.. మొహమాటం లేకుండా ఆ విషయం చెప్పిన జగన్
YS Jagan : సీఎం జగన్ ఉన్నపళంగా నిన్న సాయంత్రం స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.అమిత్ షా తెలంగాణకు వచ్చి మునుగోడు సభలో పాల్గొన్న టైంలో దేశరాజధానిలో ఒక్కసారిగా బాంబ్ పేలింది. బీజేపీ పశ్చిమ ఎంపీ ఒకరు లిక్కర్ స్కాం గురించి బయటపట్టారు. అందులో ఏపీ ప్రభుత్వానికి చెందిన రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, తెలంగాణకు చెందిన సీఎం కూతురు కవిత పేర్లు బయటకు వచ్చాయి.
YS Jagan : నిజంగా పోలవరమే టాపికా..
ఈ విషయం వెలుగులోకి వచ్చిన గంటల వ్యవధిలోనే జగన్ ఢిల్లీకి బయలు దేరి వెళ్లారని తెలిసింది. అంత సడన్‌గా ఎందుకు వెళ్లారని అంతా అనుమానం వ్యక్తం చేశారు. లిక్కర్ స్కాంలో ఏపీకి చెందిన వారి పేర్లు ప్రధానంగా వినిపించడంతో ఈ కేసు నుంచి బయటపడేయాలని ప్రధానిని కలిసి విన్నవించుకోవడానికే జగన్ వెళ్లారని ఏపీ ప్రతిపక్షం ఆరోపిస్తోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన మీడియా స్రవంతి ఈ స్కాంపై జోరుగా ప్రచారం చేస్తున్నాయి. అయితే, సోమవారం ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ ముగిసింది. సీఎం వెంట ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు పరిహారంపైనే ప్రధాన చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాలు, ముంపు మండలాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి పరిహారం అంశాన్ని ప్రధానితో చర్చించినట్టు వెల్లడించారు. వెంటనే సాయం చేయాలని కోరినట్టు వివరించారు. ఇదొక్కటే కాకుండా విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు, పలు రాజకీయాంశాలపై కూడా చర్చ జరిగిందని సమాచారం. మరోవైపు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు.కేంద్రమంత్రి ఆర్కే సింగ్‌తో సమావేశమై తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన రూ.6వేల కోట్ల విద్యుత్ బకాయిలపై సీఎం జగన్ చర్చించినట్టు సమాచారం. కానీ విజయసాయిరెడ్డిని, ఏపీ పెద్దలను కాపాడేందుకే జగన్ ఢిల్లీ వెళ్లారని అంతా టాక్ వినిపిస్తోంది.