Devi Navaratri 2025 | నవరాత్రి ఉపవాసం.. టీ, కాఫీ తాగవచ్చా? నిపుణుల సూచనలు ఇదే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Devi Navaratri 2025 | నవరాత్రి ఉపవాసం.. టీ, కాఫీ తాగవచ్చా? నిపుణుల సూచనలు ఇదే

 Authored By sandeep | The Telugu News | Updated on :24 September 2025,6:00 am

Devi Navaratri 2025 | నవరాత్రి పండుగను దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటారు. ఈ తొమ్మిది రోజుల ఉపవాసంలో భక్తులు దుర్గామాతను వివిధ రూపాల్లో పూజిస్తూ శరీరాన్ని శుద్ధి చేసుకోవడమే కాక మనస్సుకు శాంతిని పొందడానికి ప్రయత్నిస్తారు. అయితే ఉపవాసం సమయంలో ఏమి తినాలి, ఏమి తినకూడదు అన్న సందేహాలు ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యంగా టీ, కాఫీ తీసుకోవచ్చా అనే విషయంలో చాలా మంది గందరగోళానికి గురవుతుంటారు.

#image_title

అవి మాత్ర‌మే..

నిపుణుల ప్రకారం, ఉపవాస సమయంలో టీ లేదా కాఫీ తాగడానికి ఎలాంటి మతపరమైన ఆంక్షలు లేవు. కొందరు కేవలం పండ్లు, పాలు మాత్రమే తీసుకుంటే, మరికొందరు టీ, కాఫీ కూడా తీసుకుంటారు. ఇది పూర్తిగా వ్యక్తిగత అలవాట్లు, ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది.అయితే ఆరోగ్య పరంగా చూసుకుంటే ఖాళీ కడుపుతో ఎక్కువసార్లు టీ, కాఫీ తాగడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు.

వీటిలో ఉండే కెఫిన్ గ్యాస్, గుండెల్లో మంట, ఆమ్లత్వం వంటి సమస్యలను పెంచే అవకాశం ఉంది. కాఫీ ముఖ్యంగా అధిక ఆమ్లత్వాన్ని కలిగి ఉండటంతో ఉపవాసంలో దాన్ని మితంగా మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు. టీలో చక్కెర, పాలు ఎక్కువగా వేస్తే జీర్ణక్రియలో ఇబ్బందులు రావచ్చని హెచ్చరిస్తున్నారు. కొబ్బరి నీరు, నిమ్మరసం, పాలు, పండ్లరసం వంటి ప్రత్యామ్నాయాలు ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది