Fasting : ఉపవాసం చేయటం వల్ల క్యాన్సర్ కు చెక్ పెట్టొచ్చు తెలుసా… సర్వేలో తేలిన సంచలన విషయాలు..
ప్రధానాంశాలు:
Fasting : ఉపవాసం చేయటం వల్ల క్యాన్సర్ కు చెక్ పెట్టొచ్చు తెలుసా... సర్వేలో తేలిన సంచలన విషయాలు..
Fasting : ప్రస్తుత కాలంలో ఎంతో మంది ఎన్నో రకాల వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. అయితే ఈ వ్యాధులలో ఒకటి క్యాన్సర్ కూడా. ఈ క్యాన్సర్ మహమ్మారి అనేది ప్రపంచాన్ని ఎంతగానో భయపెడుతున్న వ్యాధులలో ఇది కూడా ఒకటి. అయితే ఈ వ్యాధి అనేది చిన్న పెద్ద,ఆడ మగ అనే తేడా లేకుండా అందరికీ ఈ వ్యాధి కనేది రావటం కామన్ గా మారింది. అయితే మారుతున్న జీవన ప్రమాణాలు కారణంగా ఒక్కొక్కరి లో ఒక్కొక్క రకమైన క్యాన్సర్ అనేది వస్తుంది. ఈ క్యాన్సర్ కి చెక్ పెట్టడానికి ఎన్నో రకాల ట్రీట్మెంట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయినా కూడా ఈ వ్యాధిని ముందుగా గుర్తించటమే ప్రధాన సమస్యగా మారింది.
కానీ ఈ క్యాన్సర్ పై జరుగుతున్నటువంటి కొన్ని అధ్యయనాల ద్వారా అందరికీ ఉపయోగపడే కొన్ని విషయాలు వేలుగులోకి వచ్చాయి. అయితే జనరల్ గా బరువు నియంత్రించడానికి లేక పండగ టైమ్ లో ఆచరించే ఒక నియమం వలన కూడా క్యాన్సర్ కణితిని నియంత్రించవచ్చు అని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి. అయితే చాలామంది బరువు తగ్గటం కోసం మరియు ఫిట్ గా ఉండటం కోసం పండగ టైంలో చేసే ఉపవాసం వలన క్యాన్సర్ కు చెక్ పెట్టవచ్చు అని తాజాగా పరిశోధనలో తేలింది. అయితే ఎంతో కష్టపడి చేసినటువంటి ఈ పరిశోధనాలు సక్సెస్ అవటంతో మనుషులపై కూడా సక్సెస్ అవుతుంది అని పరిశోధకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ ఉపవాసలు చేయటం వలన శరీరం యొక్క సహజమైన రక్షణ స్థాయి అనేది ఎంతో మెరుగుపడుతుంది. అందుకే దీనివల్ల క్యాన్సర్ ప్రమాదాలను నియంత్రించవచ్చు అని పరిశోధకులు అంటున్నారు. ఎలకలపై చేసినటువంటి ఈ పరిశోధనలు ఉపవాసం వలన క్యాన్సర్ కు వ్యతిరేకంగా శరీరం యొక్క సహజ రక్షణ వ్యవస్థ శక్తివంతం చేస్తుంది అని పరిశోధకులు కనుక్కున్నారు. ఈ ఉపవాసం చేయడం వలన సహజ కిల్లర్ కణాల పరిధి అనేది ఎంతో మెరుగుపడుతుంది అని తెలుసుకున్నారు. అందుకే ఇది క్యాన్సర్ కణాలపై దాడి చేసి రోగనిరోధక వ్యవస్థలో కీలకమైన భాగం అని వారు తెలుసుకున్నారు…