Melbourne Airport | మల్లెపూల మాల కోసం భారీ జరిమానా… నవ్య నాయర్‌కు ఆస్ట్రేలియాలో ఇబ్బందులు!
Melbourne Airport | ప్రముఖ మలయాళ నటి నవ్య నాయర్ కు ఆస్ట్రేలియాలోని ఎయిర్‌పోర్ట్‌లో ఊహించని అనుభవం ఎదురైంది. ఓనం వేడుకల్లో పాల్గొనడానికి ఆమె ఇటీవల ఆస్ట్రేలియాకు వెళ్లారు. అయితే మెల్‌బోర్న్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన సమయంలో, ఆమె హ్యాండ్‌బ్యాగ్‌లో మల్లెపూల మాల కనిపించడంతో అధికారులు ఆమెకు ఏకంగా రూ. 1.14 లక్షల జరిమానా విధించారు.

#image_title
చట్టవిరుద్ధం!
ఆస్ట్రేలియాలోని మలయాళీ అసోసియేషన్ ఆఫ్ విక్టోరియా నిర్వహించిన ఓనం వేడుకల్లో పాల్గొనడానికి నవ్య నాయర్ అక్కడికి వెళ్లారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం “నా కోసం మల్లెపూలు మా నాన్న తెచ్చారు. వాటిని రెండు భాగాలుగా పంచాను. కొచ్చి నుండి సింగపూర్ ప్రయాణ సమయంలో వాటిలో ఒక భాగాన్ని తలలో పెట్టుకున్నాను. మిగిలినవి తర్వాత సింగపూర్ నుండి ఆస్ట్రేలియాకి వెళ్లేటప్పుడు ఉపయోగించాలనుకొని హ్యాండ్‌బ్యాగ్‌లో ఉంచాను. కానీ నాకు ఇది చట్టవిరుద్ధమని తెలియదు. వారు నాకు రూ.1.14 లక్షల జరిమానా విధించారు. ఈ మొత్తాన్ని 28 రోజుల్లోపు చెల్లించాలని చెప్పారు.”
నేను ఉద్దేశపూర్వకంగా చేయలేదు. ఇది అజ్ఞానంతో జరిగిన పని. కానీ అజ్ఞానం క్షమించబడదు అని తెలుసుకున్నాను. ఇది నా జీవితంలో ఖరీదైన పాఠం అని పేర్కొన్నారు.ప్రస్తుతం ఈ ఘటన ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దక్షిణాదిలో ఓనం పండుగకు మల్లెపూలు ఎంతో ముఖ్యమైనవి. కానీ విదేశీ నిబంధనలు, జీవ సంబంధిత వస్తువులపై నిషేధాలు ఉన్న దేశాల్లో ముఖ్యంగా ఆస్ట్రేలియా వంటి బయోసెక్యూరిటీ దేశాలలో ఇటువంటి వస్తువులు తీసుకెళ్లడం చట్టవిరుద్ధం.