India vs Australia : ఆస్ట్రేలియాతో భారత్ సెమీస్ పోరుకు రెడీ.. టీమిండియా రివేంజ్ తీర్చుకుంటుందా ?
ప్రధానాంశాలు:
India vs Australia : నేడు ఆస్ట్రేలియాతో భారత్ సెమీస్ పోరు.. టీమిండియా రివేంజ్ తీర్చుకుంటుందా ?
India vs Australia : ఛాంపియన్స్ ట్రోఫీ champion trophy సెమీ ఫైనల్‌కి semi final సమయం ఆసన్నమైంది. దుబాయ్ Dubai వేదికగా మధ్యాహ్నం 2:30 గంటల నుంచి మ్యాచ్ ఆరంభం కానుండగా, ఈ మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తారు అన్నదాని గురించి జోరుగా చర్చ నడుస్తుంది. రెండేండ్ల క్రితం డబ్ల్యూటీసీ చాంపియన్‌షిప్‌లో టీమ్‌ఇండియాకు కప్‌ని దూరం చేసింది ఆసీస్ జట్టు.

India vs Australia : ఆస్ట్రేలియాతో భారత్ సెమీస్ పోరుకు రెడీ.. టీమిండియా రివేంజ్ తీర్చుకుంటుందా ?
India vs Australia గట్టి పోరు..
ఇక ఏడాదిన్నర క్రితం వన్డే ప్రపంచకప్‌లో అజేయంగా ఫైనల్‌కు చేరిన టీమ్‌ఇండియాకి Team India కప్పు దక్కకుండా చేసింది. మరి 11 ఏండ్ల తర్వాత చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న టీమ్‌ఇండియా కలకి ఆసీస్ ఏమైన పడుతుందా, లేదంటే భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా అనేది మరి కొద్ది గంటలలో తేలిపోతుంది.
పలు కారణాలతో ఆసీస్ పేస్ త్రయం కమిన్స్, హెజిల్‌వుడ్, స్టార్క్ దూరమవడంతో ఆ జట్టు పేస్ విభాగం బలహీనంగా ఉంది. కాని ఐసీసీ IC టోర్నీలంటేనే చెలరేగే ఆడే ట్రావిస్ హెడ్‌ను త్వరగా ఔట్ చేస్తేనే మ్యాచ్‌పై టీమ్‌ఇండియా పట్టుబిగించే అవకాశముంటుంది. ఏ క్షణంలో అయినా మ్యాచ్‌ను మలుపు తిప్పే సామర్థ్యం అతడి సొంతం. భారత స్పిన్నర్లు ఆసీస్ బలమైన బ్యాటింగ్ లైనప్‌నకు ఎలా అడ్డుకట్ట వేస్తారనేది ఆసక్తికరం.