Steve Smith : ఓడిపోయినా బుద్ధి రాలేదు, స్మిత్ కి వరస్ట్ కక్రుత్తి !
ప్రధానాంశాలు:
Steve Smith : ఓడిపోయినా బుద్ధి రాలేదు, స్మిత్ కి వరస్ట్ కక్రుత్తి !
Steve Smith : ఆస్ట్రేలియా Australia ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గ్రూప్ స్టేజ్ లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే పూర్తిగా ఆడింది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ రద్దు కాగా, అప్ఘానిస్థాన్ తో జరిగిన మ్యాచ్ కూడా మధ్యలోనే వర్షం వల్ల క్యాన్సిల్ అయింది. కేవలం ఇంగ్లాండ్ పై ఆడిన మ్యాచ్ లో మాత్రమే గెలిచింది. ఇక సెమీఫైనల్ లో భారత్ చేతిలో ఓడి ఇంటిముఖం పట్టింది. స్మిత్ ఎన్ని ప్రణాళికలు రచించిన ఆ పప్పులు ఏమి ఉడకలేదు.

Steve Smith : ఓడిపోయినా బుద్ధి రాలేదు, స్మిత్ కి వరస్ట్ కక్రుత్తి !
Steve Smith ఇదేం నిర్ణయం..
అయితే ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ Smith ఓటమి తర్వాత షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. వన్డే ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా సెమీఫైనల్ లో ఆస్ట్రేలియా ఓటమి అనంతరం స్టీవ్ స్మిత్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఇక ఇదిలా ఉంటే భారత్‌ని కట్టడి చేసేందుకు స్టీవ్ స్మిత్ ఏకంగా ఏడుగురు బౌలర్స్‌ని ప్రయోగించాడు. కాని పెద్దగా ఫలితం రాలేదు.
ఇక బ్యాటింగ్‌లోను దూకుడు ప్రదర్శించారు. హెడ్,స్మిత్, క్యారీ వంటి వారు బౌలర్స్‌ని చీల్చి చెండాడే ప్రయత్నం చేసిన అంత సక్సెస్ కాలేకపోయారు. 300కి పైగా పరుగులు చేసి ఇండియాని కష్టాలలోకి నెట్టాలని అనుకున్నారు. కాని స్మిత్ పప్పులు ఏవి ఇక్కడ ఉడకలేదు. గ్రూప్ స్టేజ్ లో బంగ్లా, పాకిస్థాన్, న్యూజిలాండ్ పై విజయం సాధించిన భారత్ India ఇప్పుడు ఏకంగా ఆస్ట్రేలియాని కూడా మట్టి కరిపించింది.