Chandrababu : అయ్యో చంద్రబాబు.. పోయి పోయి వాళ్ల చేతిలోనే పడ్డావా? ఇక నీకు మూడినట్టే?
Chandrababu : ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడును నెటిజన్స్ టార్గెట్ చేశారు. ఎప్పుడెప్పుడు బాబు దొరుకుతాడా ఏకి పారేద్దాం అని ఎదురు చూస్తున్న వారికి దొరకనే దొరికాడు. చంద్రబాబు నాయుడు తాజా చేసిన వ్యాఖ్యలే ఆయన ట్రోల్స్ కు కారణం అయ్యాయి. ఇంతకు ఆయన ఏమన్నాడంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైకో ఉన్మాది మాదిరిగా ప్రవర్తిస్తే ఆయన్ను ఇంటికి పంపించడం జరిగింది. ఇప్పుడు జగన్ కూడా అలాగే ప్రవర్తిస్తే ఖచ్చితంగా ఆయనకు పరాభవం తప్పదంటూ హెచ్చరించాడు. ఈ సందర్బంగా జగన్ అభిమానులు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతున్నారు. ట్రంప్ కు జగన్ కు పోలిక పెట్టిన నీ మైండ్ మొద్దుబారి పోయినట్లుగా ఉందంటూ విమర్శలు చేస్తున్నారు.

netizens trolls chandra babu naidu in trump and jagan issue
Chandrababu అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు వద్దంటారేమో
వైకాపా నాయకులు గత కొంత కాలంగా ఎలక్షన్ కమీషన్ నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను వద్దనడం విడ్డూరంగా ఉందంటూ అసహనం వ్యక్తం చేశారు. అసలు వైకాపా నాయకులు ముందు ముందు పార్లమెంట్ మరియు అసెంబ్లీ ఎన్నికలకు అయినా ఒప్పుకుంటారా లేదా అంటూ ప్రశ్నించారు. ఈ విషయంలో తెలుగు దేశం పార్టీ ఎన్నో సార్లు ఎన్నికల కమీషన్ కు మద్దతుగా నిలిచింది. దాంతో తాము చెప్పినట్లుగా ఎన్నికల కమీషన్ పని చేస్తుందని విమర్శలు చేయడం మొదలు పెట్టారు. మీకు ఏమాత్రం బుద్ది జ్ఞానం ఉన్నా కూడా ఇకనైనా స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకోరు అంటూ ఈ సందర్బంగా బాబు అన్నాడు.
జగన్ ట్రంప్ కాదు బాబు నువ్వే..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కు ఎలా అయితే పరాభవం ఎదురైందో అలాగే వచ్చే ఎన్నికల్లో జగన్ కు కూడా అవుతుందని చంద్రబాబు నాయుడు హెచ్చరించాడు. దాంతో జగన్ అభిమానులు మరియు నెటిజన్స్ ఓ రేంజ్ లో విమర్శలు చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో నీకు జనాలు చిత్కారాలు కొట్టారు. నువ్వు జగన్ గురించి ట్రంప్ గురించి మాట్లాడుతున్నావా. బైడెన్ కు ట్రంప్ చాలా బలంగా పోటీ ఇచ్చాడు. కాని గడచిన ఎన్నికల్లో కనీసం పోటీ ఇవ్వలేక పోయావు. కనుక నువ్వు ట్రంప్ కంటే మరీ సైకో ఉన్మాదివి అంటూ ట్రోల్స్ వస్తున్నాయి. పోయి పోయి ఆ విషయంలో బాబు నోరు జారడంతో కామెంట్స్ ఓ రేంజ్ లో వస్తున్నాయి.