New Ration Card : నిరీక్షణకి తెరపడ్డట్టేనా.. కొత్త రేషన్ కార్డ్‌పై శుభవార్త చెప్పిన రేవంత్ రెడ్డి
ప్రధానాంశాలు:
New Ration Card : నిరీక్షణకి తెరపడ్డట్టేనా.. కొత్త రేషన్ కార్డ్‌పై శుభవార్త చెప్పిన రేవంత్ రెడ్డి
New Ration Card : తెలంగాణలో ప్రతీ పథకానికి కూడా రేషన్ కార్డులను ప్రామాణికం చేయడం మనం చూశాం. అయితే రేషన్ కార్డ్ ప్రామాణికం కావడంతో చాలా మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా కొత్త దరఖాస్తులను సమర్పించేందుకు ఎమ్మార్వో ఆఫీస్ ల చుట్టూ తిరుగుతున్నారు.పూర్తి హెల్త్ ప్రొఫైల్‌తో రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి హెల్త్ కార్డులు ఇవ్వబోతున్నట్లు రేవంత్ రెడ్డి వివరించారు. కాగా.. రేషన్ కార్డులు ఆర్యోగ్య శ్రీ కార్డులను వేరు వేరుగా అందిచాలని ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ కార్డులకు అర్హులను గుర్తించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సైతం తెలంగాణలోని అర్హులందరికీ తెల్లరేషన్ కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించింది
New Ration Card సమయం లేదు మిత్రమా..
ఆరు గ్యారెంటీలకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య కంటే కూడా.. రేషన్ కార్డు కావాలని పెట్టుకున్న అర్జీలే ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల రైతు రుణమాఫీ ప్రక్రియలో కూడా రేషన్ కార్డు ఆధారంగానే రుణమాఫీని పూర్తి చేశారు.ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న చాలా మంది రేషన్ కార్డుల మంజూరు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఉచిత కరెంట్, గ్యాస్ సిలిండర్ వంటి పథకాలకు ఈ రేషన్ కార్డే ప్రామాణికంగా ఉండటంతో.. ఈ రెండు పథకాలు అందక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వీటితో పాటు.. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి కూడా రేషన్ కార్డు ఉంటేనే ఆసుపత్రిలో ఓపీ సేవలు అందుతున్నాయి. రాష్ట్ర క్యాబినెట్ ఈ నెల 20న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ కానుండగా, ఈ బేటిలో రేషన్ కార్డులకు సంబంధించి విధివిధానాలను ఖరారు చేయనున్నారు.
దీంతో పాటు హైదరాబాద్ కు చట్టబద్ధత కల్పించడం, వరద నష్టం, హెల్త్ కార్డులు, రైతు భరోసా, విద్యా, రైతు కమిషన్ తదితర అంశాలపై చర్చించనున్నారు. దీని తర్వాత వచ్చే నెల ఆఖరు నాటికి రేషన్ కార్డులను మంజూరు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సారి రేషన్ కార్డులో కీలక మార్పులు చేయనున్నారు. స్మార్ట్ కార్డు తరహాలో వీటిని మంజూరు చేయనున్నారు.ప్రజారోగ్య కార్యక్రమాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నందున హెల్త్ కార్డుల జారీ కూడా ఎజెండాలో ఉంది. ఈ హెల్త్ కార్డ్‌లు పౌరులకు వైద్య ప్రయోజనాలు మరియు బీమా కవరేజీని అందజేస్తాయని, సరసమైన ఆరోగ్య సంరక్షణ సేవలకు ప్రాప్యతను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.