New Ration Card : మీ కొత్త రేషన్ కార్డు వివరాలను ఇంట్లో ఉండే చూసుకోవచ్చు.. ఎలా అంటే ?
ప్రధానాంశాలు:
New Ration Card : మీ కొత్త రేషన్ కార్డు వివరాలను ఇంట్లో ఉండే చూసుకోవచ్చు.. ఎలా అంటే ?
New Ration Card : తెలంగాణ రాష్ట్రంలో Telangana New కొత్త రేషన్ కార్డులను New Ration Card జారీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం Congress Govt సన్నాహాలు పూర్తి చేసింది. ఇప్పటికే అర్హత కలిగిన లక్షలాది మంది లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. గ్రామ సభలు, అలాగే మీ సేవా కేంద్రాల ద్వారా ప్రజలు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకోవడంతో కొత్త కార్డులపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అయితే దరఖాస్తు చేసినప్పటికీ స్టేటస్ తెలియక వారిలో ఆందోళన మొదలైంది. తమకు రేషన్ కార్డు వస్తుందా? లేదా? అనే సందేహంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

New Ration Card : మీ కొత్త రేషన్ కార్డు వివరాలను ఇంట్లో ఉండే చూసుకోవచ్చు.. ఎలా అంటే ?
New Ration Card రేషన్ కార్డు విషయంలో అయోమయం అవసరం లేదు.. ఇలా చేస్తే మీకే తెలుస్తుంది
తెలుపు రంగు రేషన్ కార్డు కలిగి ఉండటం వల్ల విద్య, వైద్యం వంటి కీలక రంగాల్లో అనేక రకాల ప్రయోజనాలు లభిస్తాయి. ఉచిత విద్యుత్తు, తగ్గిన ధరకు గ్యాస్ సిలిండర్ వంటి పథకాలకు ఇది తప్పనిసరి కావడంతో ప్రజలు అధిక సంఖ్యలో దరఖాస్తు చేశారు. గత పదేళ్లుగా కొత్త కార్డులు జారీ కాకపోవడంతో దరఖాస్తుదారుల సంఖ్య భారీగా పెరిగింది. తాజా సమాచారం మేరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఆరు లక్షల మందికి పైగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. కానీ తమ దరఖాస్తుల స్థితి ఏంటో తెలియక ప్రజలు తిరిగి మీ సేవా కేంద్రాలను దర్శిస్తున్నప్పటికీ సమాచారం లేకుండా నిరాశతో వెనుదిరుగుతున్నారు.
ఈ నేపథ్యంలో రేషన్ కార్డు స్టేటస్ తెలుసుకునేందుకు ప్రభుత్వం సులభమైన విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటి నుంచే మొబైల్ ఫోన్ ద్వారా రేషన్ కార్డు దరఖాస్తు స్థితిని తెలుసుకునే అవకాశం కల్పించింది. https://epds.telangana.gov.in/FoodSecurityAct/ అనే అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి, అందులో FSC Application Search అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ జిల్లాను సెలెక్ట్ చేసి, మీ సేవా అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ దరఖాస్తు పరిస్థితి – పరిశీలనలో ఉందా, మంజూరు అయ్యిందా లేదా రిజెక్ట్ అయిందా అన్నది తెలుసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే చెక్ చేసుకోండి.