New Ration Card : కొత్త రేషన్ కార్డు కావాలంటే ఈ డాక్యుమెంట్లు ఉండాల్సిందే..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

New Ration Card : కొత్త రేషన్ కార్డు కావాలంటే ఈ డాక్యుమెంట్లు ఉండాల్సిందే..!!

 Authored By ramalingaiahtandu | The Telugu News | Updated on :14 May 2025,1:00 pm

ప్రధానాంశాలు:

  •  New Ration Card : కొత్త రేషన్ కార్డు కావాలంటే ఈ డాక్యుమెంట్లు ఉండాల్సిందే..!!

New Ration Card : ఏపీ సర్కార్ కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానించడంతో ఎన్నో కుటుంబాలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు, మార్పులు, చేర్పులకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. జూన్ నెల నుంచి రేషన్ కార్డుల స్థానంలో ఆధునిక స్మార్ట్ కార్డులు తీసుకురానున్నట్లు అధికారులు ప్రకటించారు. అంతేకాకుండా రేషన్ సేవలను మరింత సులభతరం చేయడానికి ఈ నెల 15 నుంచి వాట్సాప్ గవర్నెన్స్‌ ద్వారా సేవలు ప్రారంభమవుతాయి. దీనికోసం 95523 00009 అనే నంబర్‌కి “Hello” అని మెసేజ్ పంపితే సరిపోతుంది.

New Ration Card కొత్త రేషన్ కార్డు కావాలంటే ఈ డాక్యుమెంట్లు ఉండాల్సిందే

New Ration Card : కొత్త రేషన్ కార్డు కావాలంటే ఈ డాక్యుమెంట్లు ఉండాల్సిందే..!!

New Ration Card : కొత్త రేషన్ దారులు ఈ డాక్యుమెంట్లు దగ్గర పెట్టుకోండి..లేదంటే మీకు రేషన్ కార్డు రానట్లే

కొత్త రేషన్ కార్డు పొందాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.2 లక్షలకు లోపుగా ఉండాలి. అంతేకాక GSWS హౌస్ హోల్డ్ డేటాబేస్‌లో పేరు నమోదై ఉండాలి. కుటుంబంలో ఎవరికీ ఇప్పటికే రైస్ కార్డు ఉండకూడదు. అవసరమైన డాక్యుమెంట్ల విషయానికొస్తే, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు తప్పనిసరి. రేషన్ కార్డులో కొత్త సభ్యుల పేర్లు చేర్చాలంటే, భార్యకు మ్యారేజ్ సర్టిఫికెట్, పిల్లలకైతే బర్త్ సర్టిఫికెట్, ఆధార్ అవసరం. అదనంగా, వివాహ సమయంలో తీసిన దంపతుల ఫోటో కూడా సమర్పించాలి.

ఒకే రేషన్ కార్డులో రెండు కుటుంబాలు ఉండగా, కొత్తగా విడిగా కార్డు తీసుకోవాలనుకుంటే, కనీసం నాలుగు సభ్యులు ఉండాలి. అలాంటి సందర్భాల్లో సంబంధిత ఆధార్ కార్డులు, వివాహ ధృవీకరణ పత్రాలు, మరియు ప్రస్తుత రేషన్ కార్డు జిరాక్స్‌లను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారం సచివాలయంలో అందుబాటులో ఉంటుంది. అవసరమైన రుసుముతో పాటు పత్రాలు సమర్పించిన తర్వాత, సంబంధిత అధికారులు పరిశీలన చేసి కొత్త రేషన్ కార్డు జారీ చేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ సులభంగా రేషన్ కార్డు లభించనుంది.

ramalingaiahtandu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది