కసాయి తల్లి బాత్రూంలో నుండి బిడ్డను బయటకు విసిరేసింది..!!
ప్రపంచంలో ఉన్న కొద్ది మానవత్వం కరిగిపోతుంది. ఒకప్పుడు సమాజంలో ఎక్కడో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకునేది. ఆ వార్తకి చాలామంది భయపడిపోయే వాళ్ళు. కానీ ఇప్పుడు సమాజంలో జరుగుతున్న చాలా సంగతులు నార్మల్ అయిపోయాయి. ఇక ఇదే సమయంలో కుటుంబ సభ్యుల సైతం.. సొంత ఇంట్లో వాళ్ళ పట్ల దారుణమైన పనులకు పాల్పడుతున్నారు. భార్య భర్తల మధ్య గొడవలు అక్రమ సంబంధాలు.. ప్రాణాలు తీసుకునే పరిస్థితికి దాపరిస్తోంది. ఇదే సమయంలో పెళ్లి కాకముందే అమ్మాయిలు గర్భం దాల్చడం ఈమధ్య పరిపాటయిపోయింది.
ఈ దిశగానే దేశ రాజధాని ఢిల్లీలో న్యూ అశోక్ నగర్ లో ప్రేమించిన యువతి పెళ్లి కాకుండా తల్లి అయింది. దీంతో సమాజంలో చుట్టుప్రక్కల బంధువుల మధ్య హేళన భరించలేక… కళ్ళు కూడా తెరవని పసిబిడ్డను గంటల వ్యవధిలో బాత్రూం నుండి బయటకు విసిరేసింది. దీంతో అక్కడికక్కడే ఆ బిడ్డ ప్రాణాలు విడిచింది. పూర్తి వివరాల్లోకి వెళితే ప్రియా అనే 20 ఏళ్ల యువతీ తూర్పు ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ జై అంబే అపార్ట్మెంట్ లో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. నోయిడాలో ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ ఉంది. ప్రేమ మాయలో పడి పెళ్లి కాకుండానే గర్భం దాల్చింది. అయితే సోమవారం మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో పుట్టిన ఆ బిడ్డను అపార్ట్మెంట్ మూడో అంతస్తు బాత్రూం నుండి కిందికి విసిరేసింది.
అయితే ఆ అపార్ట్మెంట్ లో ఉంటున్న వారికి శబ్దం గట్టిగ వినబడి వెళ్లి చూడగా రక్తపు మడుగులో శిశువు కనబడింది. తక్షణమే చిన్నారిని నోయిడా ఆసుపత్రికి తరలించగా… అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకొని అపార్ట్మెంట్ లో పోలీసులు తనిఖీ చేయడంతో ప్రియా యువతి ఫ్లాట్ లో రక్తపు మడుగులు కనిపించడంతో విషయం మొత్తం వెలుగులోకి వచ్చింది. పెళ్లికాకముందే తల్లి అయ్యానని బంధువులు మరియు సమాజం చేసే హేళన భరించలేక ఈ పని చేసినట్లు అంగీకరించింది. దీంతో తల్లిదండ్రులతో పాటు యువతిపై ఇంకా ఈ ఘటన వెనక ఉన్న వారి పాత్ర పై పోలీసులు విచారణ చేపట్టి ఐసీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. యువతిని ఆసుపత్రికి తరలించారు.
FEARING SOCIETAL STIGMA: In a tragic incident, a 20-year-old unmarried girl threw her newborn baby boy from the window of her washroom after giving birth due to fear of the society.
The girl was a resident ofJai Ambey Apartments in East Delhi’s Kondli. pic.twitter.com/3EBml5d0W5
— truth. (@thetruthin) January 9, 2023