NHPC Recruitment : విద్యుత్ సబ్ స్టేషన్ లో 300 జాబ్స్… ఎలాంటి రాత పరీక్ష ఉండదు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

NHPC Recruitment : విద్యుత్ సబ్ స్టేషన్ లో 300 జాబ్స్… ఎలాంటి రాత పరీక్ష ఉండదు…!

 Authored By ramu | The Telugu News | Updated on :20 March 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  NHPC Recruitment : విద్యుత్ సబ్ స్టేషన్ లో 300 జాబ్స్...ఎలాంటి రాత పరీక్ష ఉండదు...!

NHPC Recruitment : నిరుద్యోగ యువతకు శుభవార్త. తాజాగా ప్రముఖ ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ( NHPC ) నుండి దాదాపు 300 Trainee ఇంజనీర్ పోస్టులను భర్తీ చేసేందుకు భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇక ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఈ నోటిఫికేషన్ మనకు ప్రముఖ ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ NHPC నుండి విడుదల కావడం జరిగింది.

ఖాళీలు : ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 300 ట్రైనింగ్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

వయస్సు : ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారి వయసు కనిష్టంగా 18 గరిష్టంగా 30 సంవత్సరాల మధ్య కలిగి ఉండాల . అదేవిధంగా ప్రభుత్వ నిబంధన ప్రకారం SC ,ST లకు 5 సంవత్సరాలు OBC లకు 3 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.

విద్యార్హత : ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారు కచ్చితంగా BE/BTECH /PG విద్యార్హత కలిగి ఉండాలి.

జీతం  : ఈ ట్రైనింగ్ లో సెలెక్ట్ అయిన వారికి 45 వేల రూపాయలు Stipend ఇస్తారు.

రుసుము : ఈ ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునే SC ,ST లకు ఎలాంటి ఫీజు ఉండదు కాబట్టి వెంటనే అప్లై చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు : ఈ ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయాలనుకునేవారు 6th మర్చి నుండి 26 మార్చి లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

పరీక్ష విధానం : ఈ ఉద్యోగానికి గేట్ 2023లో వచ్చిన స్కోర్ ఆధారంగా మరియు పర్సనల్ ఇంటర్వ్యూ గ్రూప్ డిస్కషన్ ద్వారా సెలక్షన్ చేసి ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత గవర్నమెంట్ జాబ్ ఇస్తారు.

ఎలా అప్లై చేయాలి : ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారు సంబంధిత ఆఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తి వివరాలు నమోదు చేసి సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది