Union Budget 2022 : బ్రేకింగ్.. చిన్న పరిశ్రమలకు నిర్మలమ్మ గుడ్ న్యూస్
Union Budget 2022 : బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సందర్భంగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేసారు. ఆత్మ నిర్భర భారత్ కు విశేష స్పందన వచ్చిందని చెప్పిన ఆమె చిన్న పరిశ్రమలకు ఇంకో రెండు లక్షల ఋణం ఇస్తామని ప్రకటించారు. ఇందు కోసం రెండు లక్షల కోట్లను కేటాయిస్తున్నట్టుగా నిర్మలమ్మ చెప్పారు. మహిళలు వ్యాపారంలో వృద్ధి సాధించాడానికి కృషి చేస్తామని అన్నారు.
వచ్చే 25 ఏళ్ళను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ప్రవేశ పెడుతున్నామని అన్నారు. రైల్వేలో సరుకుల రవాణాకు కొత్త ప్రాజెక్ట్ లు తీసుకొస్తున్నామని చెప్పారు. దేశంలో సేంద్రీయ వ్యవసాయానికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామని అన్నారు. పర్వతమాల ప్రాజెక్ట్ లో భాగంగా 8 వేల రోప్ వేలను అభివృద్ధి చేస్తామని అన్నారు. చిరుధాన్యాల ఉత్పత్తికి కేంద్రం అండగా నిలుస్తుందని తెలిపారు.
లక్ష పోస్ట్ ఆఫీసుల్లో డిజిటల్ బ్యాంకింగ్ సేవలను తీసుకొస్తున్నామని చెప్పారు. ఎయిర్ ఇండియా బదిలీ సంపూర్ణం అయిందని అన్నారు నిర్మల. వంట నూనెల దిగుమతి పై ఆధారపడటం లేదని, మన దగ్గరే ఉత్పత్తి చేసుకునే విధంగా చర్యలు చేపదుతున్నామని నిర్మల చెప్పారు. జాతీయ రహదారులను 25 వేల కిలోమీటర్లు పెంచామన్నారు.