Home » Andhra Pradesh » No Value For Nara Lokesh Words
andhra pradesh

Nara Lokesh : ఓడిపోయిన నారా లోకేష్ ఎన్ని మాట్లాడినా పట్టించుకునే వారే ఉండరు

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: May 6, 2022, 7:40 am
Advertisement

Nara Lokesh : రాజకీయాల్లో గెలిస్తేనే గౌరవం.. అధికారంలో ఉంటేనే హుందాతనం. ఓడిపోయిన వారికి.. అధికారం కోల్పోయిన వారికి జనాల్లో విలువ ఉండదు. ఓడిపోయిన ఫ్రస్టేషన్‌ లో ఏదో మాట్లాడుతూ ఉంటారు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంచి చేసిన అధికార పార్టీని కూడా ప్రతిపక్ష పార్టీ తిడుతూ ఉంటారు అని ప్రతి ఒక్క సామాన్య జనాలకు కూడా తెలుసు. ఇప్పుడు తెలుగు దేశం పార్టీ ఎంత మొత్తుకున్నా.. ఆ పార్టీ నాయకులు ఎంతగా అరిచి గీ పెడుతున్నా కూడా జనాలు కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

మళ్లీ అధికారంలోకి రావడం కోసం తెలుగు దేశం పార్టీ నాయకులు నోటికి వచ్చినట్లుగా వైకాపా పై మరియు సీఎం జగన్‌ పై విమర్శలు చేస్తున్నారు అనే విషయం జనాలకు అర్థం అయ్యింది. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అధికార పార్టీని విమర్శించడం పర్వాలేదు.. అది జరుగుతూనే ఉంటుంది. కాని జరుగుతున్న పనులు జరుగకుండా అడ్డుకోవడం.. సంక్షేమ పథకాలకు మోకాళడ్డడం వంటివి చేయడం ఏమాత్రం సమాజ శ్రేయస్సు కాదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తెలుగు దేశం పార్టీ అదే చేయడంతో ప్రజలకు వారిపై మరింతగా కోపం కలుగుతుందట.ఇటీవల నారా లోకేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రితో పాటు మంత్రులను పదే పదే విమర్శించడంతో పాటు..

no value for Nara Lokesh words

Advertisement

చిన్న విషయంను కూడా పెద్దదిగా చేసి రాద్దాంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇటీవల ఒక అఘాయిత్యం విషయంలో పోలీసులు విచారణ జరుపుతూ ఉండగా అక్కడకు వెళ్లి హడావుడి చేసి ప్రభుత్వంపై విమర్శలు చేయడం మొదలు పెట్టాడు. పోలీసుల డ్యూటీని అడ్డుకోవడంతో పాటు అలాంటి ఒక సంఘటన ను రాజకీయం చేయడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైకాపా నాయకులు మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయం పాలయ్యిన లోకేష్‌ ఎన్ని మాట్లాడినా ఫ్రస్టేషన్ తో మాట్లాడుతున్నాడు తప్ప నిజం ఉండదు అనే ఉద్దేశ్యంతో ఉన్నారు. కనుక ఆయన మాటలను పట్టించుకునే వారే లేరంటూ వైకాపా నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి