Nara Lokesh : ఓడిపోయిన నారా లోకేష్ ఎన్ని మాట్లాడినా పట్టించుకునే వారే ఉండరు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Nara Lokesh : ఓడిపోయిన నారా లోకేష్ ఎన్ని మాట్లాడినా పట్టించుకునే వారే ఉండరు

Nara Lokesh : రాజకీయాల్లో గెలిస్తేనే గౌరవం.. అధికారంలో ఉంటేనే హుందాతనం. ఓడిపోయిన వారికి.. అధికారం కోల్పోయిన వారికి జనాల్లో విలువ ఉండదు. ఓడిపోయిన ఫ్రస్టేషన్‌ లో ఏదో మాట్లాడుతూ ఉంటారు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంచి చేసిన అధికార పార్టీని కూడా ప్రతిపక్ష పార్టీ తిడుతూ ఉంటారు అని ప్రతి ఒక్క సామాన్య జనాలకు కూడా తెలుసు. ఇప్పుడు తెలుగు దేశం పార్టీ ఎంత మొత్తుకున్నా.. ఆ పార్టీ నాయకులు ఎంతగా అరిచి గీ పెడుతున్నా కూడా […]

 Authored By prabhas | The Telugu News | Updated on :6 May 2022,7:40 am

Nara Lokesh : రాజకీయాల్లో గెలిస్తేనే గౌరవం.. అధికారంలో ఉంటేనే హుందాతనం. ఓడిపోయిన వారికి.. అధికారం కోల్పోయిన వారికి జనాల్లో విలువ ఉండదు. ఓడిపోయిన ఫ్రస్టేషన్‌ లో ఏదో మాట్లాడుతూ ఉంటారు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంచి చేసిన అధికార పార్టీని కూడా ప్రతిపక్ష పార్టీ తిడుతూ ఉంటారు అని ప్రతి ఒక్క సామాన్య జనాలకు కూడా తెలుసు. ఇప్పుడు తెలుగు దేశం పార్టీ ఎంత మొత్తుకున్నా.. ఆ పార్టీ నాయకులు ఎంతగా అరిచి గీ పెడుతున్నా కూడా జనాలు కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మళ్లీ అధికారంలోకి రావడం కోసం తెలుగు దేశం పార్టీ నాయకులు నోటికి వచ్చినట్లుగా వైకాపా పై మరియు సీఎం జగన్‌ పై విమర్శలు చేస్తున్నారు అనే విషయం జనాలకు అర్థం అయ్యింది. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అధికార పార్టీని విమర్శించడం పర్వాలేదు.. అది జరుగుతూనే ఉంటుంది. కాని జరుగుతున్న పనులు జరుగకుండా అడ్డుకోవడం.. సంక్షేమ పథకాలకు మోకాళడ్డడం వంటివి చేయడం ఏమాత్రం సమాజ శ్రేయస్సు కాదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తెలుగు దేశం పార్టీ అదే చేయడంతో ప్రజలకు వారిపై మరింతగా కోపం కలుగుతుందట.ఇటీవల నారా లోకేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రితో పాటు మంత్రులను పదే పదే విమర్శించడంతో పాటు..

no value for Nara Lokesh words

no value for Nara Lokesh words

చిన్న విషయంను కూడా పెద్దదిగా చేసి రాద్దాంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇటీవల ఒక అఘాయిత్యం విషయంలో పోలీసులు విచారణ జరుపుతూ ఉండగా అక్కడకు వెళ్లి హడావుడి చేసి ప్రభుత్వంపై విమర్శలు చేయడం మొదలు పెట్టాడు. పోలీసుల డ్యూటీని అడ్డుకోవడంతో పాటు అలాంటి ఒక సంఘటన ను రాజకీయం చేయడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైకాపా నాయకులు మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయం పాలయ్యిన లోకేష్‌ ఎన్ని మాట్లాడినా ఫ్రస్టేషన్ తో మాట్లాడుతున్నాడు తప్ప నిజం ఉండదు అనే ఉద్దేశ్యంతో ఉన్నారు. కనుక ఆయన మాటలను పట్టించుకునే వారే లేరంటూ వైకాపా నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది