Bandi Sanjay : బ్రేకింగ్.. బండి సంజయ్ పై నాన్ బెయిలబుల్ కేసులు.. కాసేపట్లో కోర్టుకు హాజరు.. కోర్టు ఎదుట కార్యకర్తల ఆందోళన..!
Bandi Sanjay : తెలంగాణ భాజపా అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ పై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. గత రాత్రి నిరుద్యోగ నిరాహార దీక్షలో పాల్గొన్న బండి సంజయ్ ను అడ్డుకుని ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో సమావేశాలు, సభలకు అనుమతి లేదన్న కరీంనగర్ సీపీ.. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన బండి సంజయ్ తో పాటు 16 మందిపై డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశామన్నారు.
తమపై దాడికి యత్నించిన మరో 25 మంది భాజపా శ్రేణులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కాగా గత రాత్రి అదుపులోకి తీసుకున్న బీజేపీ చీఫ్ ను కాసేపట్లో కరీంనగర్ జిల్లా కోర్టులో హాజరుపర్చనున్నారు. కోర్టు వద్దకు చేరుకున్న బీజేపీ కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. అరెస్టులు అక్రమం అన్యాయమంటూ పోలీసుల తీరుపై మండి పడ్డారు. వెంటనే బండి సంజయ్ ను విడుదల చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు.
లేని యెడల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా… సంజయ్ కు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఉద్యోగులు, ఉపాధ్యాయుల తరుపున చేస్తున్న పోరాటం భేష్ అంటూ కొనియాడినట్లు సమాచారం.