Sabudana | నవరాత్రి ఉపవాసంలో సబుదాన ఎక్కువ తినొద్దు ..నిపుణుల హెచ్చరిక
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా తీసుకుంటారు. జీర్ణం సులభంగా అవుతుందనే కారణంతో సబుదాన ఉపవాస ఆహారంలో ప్రధాన స్థానాన్ని దక్కించుకుంది. అయితే, దీన్ని అధికంగా తినడం ఆరోగ్యానికి మేలు చేయకపోగా, హానికరమని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.
#image_title
జర జాగ్రత్త..
పోషకాహార నిపుణురాలు కిరణ్ కుక్రేజా తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో నవరాత్రి ఉపవాసంలో సబుదాన తీసుకునే విషయంలో జరిగే పొరపాట్లు ఆరోగ్యానికి తీవ్రమైన ప్రభావం చూపుతాయని తెలిపారు. సబుదానాలో స్టార్చ్ అధికంగా ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరుగుతుందని, దీని గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) కూడా ఎక్కువగా ఉండటంతో షుగర్ రోగులు తప్పనిసరిగా దూరంగా ఉండాలని సూచించారు.
అలాగే, సబుదానలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు రెండూ అధికంగా ఉండటంతో, ఉపవాస సమయంలో ఇది బరువు తగ్గడానికి సహాయపడదని, పైగా వేగంగా బరువు పెరగడానికి దారితీస్తుందని హెచ్చరించారు. కాబట్టి నవరాత్రి ఉపవాసంలో సబుదాన పరిమితంగా మాత్రమే తీసుకోవాలని, ఇతర ఆరోగ్యకరమైన ఆహారాలను కూడా ఆహార పట్టికలో చేర్చుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అంటే, ఉపవాసంలో సబుదాన మోతాదు జాగ్రత్తగా నియంత్రించుకోవడం అవసరం. షుగర్ పేషెంట్లు అయితే పూర్తిగా దూరంగా ఉండటం మంచిదని నిపుణుల సలహా