షాకింగ్ : నందిగ్రామ్ లో మమత ఓటమి.. ముందు గెలిచిందని.. తర్వాత ఓడిందని ఈసీ ప్రకటన
Nandigram : నందిగ్రామ్ లో ఎవరు గెలిచారు.. అనేదే ప్రస్తుతం పెద్ద సస్పెన్స్ గా మారింది. దేశంలో చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినా.. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు మాత్రం సర్వత్రా ఆసక్తిని కలిగించాయి. మరోసారి దీదీ పశ్చిమ బెంగాల్ లో విజయబావుట ఎగురవేసింది. అయితే.. నిజానికి తనద భవానీపూర్ నియోజకవర్గం. ఇదివరకు చాలాసార్లు తన సొంత నియోజకవర్గం నుంచే మమత పోటీ చేసింది. కానీ.. ఈసారి మాత్రం తన నియోజకవర్గం కాదని… వేరే నియోజకవర్గం నందిగ్రామ్ లో పోటీ చేసింది.
దానికి కారణం… తన పార్టీ నుంచి వెళ్లి పోయి బీజేపీలో చేరిన సువేందు అధికారి. ఆయన బీజేపీలో చేరడంతో ఆయనకు నందిగ్రామ్ నుంచి బీజేపీ టికెట్ లభించింది. దీంతో… ఆయన్ను ఎలాగైనా ఓడించాలని.. మమత నందిగ్రామ్ నుంచి పోటీ చేశారు. అయితే… మొదటి నుంచి ఆధిక్యంలో కొనసాగిన మమత.. చివరి రౌండ్లలో వెనుకపడ్డారు. నిజానికి పశ్చిమ బెంగాల్ లో అత్యధిక సీట్లను మమత గెలుచుకున్నారు. తన పార్టీనే అధికారంలోకి వచ్చింది. కానీ… మమత గెలుస్తుందా? లేదా? అని సర్వత్రా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో.. చివరి రౌండ్ల లెక్కింపు ముగిసిందని… మమతా బెనర్జీ 1200 ఓట్ల మెజారిటీతో గెలిచిందని ఈసీ ప్రకటించింది. దీంతో టీఎంసీ నేతలు, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.
ఆతర్వాత.. లేదు లేదు.. మమత గెలవలేదు.. నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి అధికారి సువేందు గెలిచారు… అంటూ ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దీంతో టీఎంసీ నేతలు బిత్తరపోయారు. ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్ సైట్ లోనూ అధికారి సువేందు గెలిచినట్టు ఉంది. అధికారి సువేందుకు 62677 ఓట్లు వచ్చాయని… మమతా బెనర్జీకి 52815 ఓట్లు వచ్చాయని.. సీపీఐ పార్టీకి చెందిన మీనాక్షీ ముఖర్జీకి 3521 ఓట్లు వచ్చాయని అందులో పేర్కొన్నారు.
Nandigram : ఎన్నికల కమిషన్ బీజేపీ ప్రతినిధిలా పనిచేస్తోంది..
అయితే.. ముందు తాను గెలిచానని చెప్పి.. ఆ తర్వాత సువేందు గెలిచారని చెప్పడం.. ఎన్నికల కమిషన్ తీరుకే మచ్చగా ఉందని మమతా బెనర్జీ ఫైర్ అయ్యారు. ఎన్నికల కమిషన్.. బీజేపీకి ప్రతినిధిలా పనిచేస్తోంది. దీనిపై నేను సుప్రీంకోర్టుకు కూడా వెళ్తా. నందిగ్రామ్ లో ఓడినా కూడా టీఎంసీ 221 కు పైగా సీట్లను సాధించింది. ఇది చాలు మాకు… బీజేపీని కట్టడి చేయడంలో మేం సఫలం అయ్యాం.. అని మమతా బెనర్జీ తెలిపారు.