Congress : కాంగ్రెస్‌కు మిత్రుల శాపాల్ !
ప్రధానాంశాలు:
Congress : కాంగ్రెస్‌కు మిత్రుల శాపాల్ !
Congress : కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీయేతర పార్టీలు జట్టుకట్టాయి. తమ కూటమికి ఇండియా అని నామకరణం చేసుకున్నాయి. అయితే, బీజేపీకి వ్యతిరేకంగా ఈ కూటమి ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అదే బీజేపీతో మళ్లి చెలిమికి సై అనడంతో విపక్ష కూటమి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయింది. నలుగురికీ సమన్వయకర్తగా వ్యవహరించిన నితీశ్ పక్కకు జరగడంతో, కూటమిలోని ఇతర మిత్రపక్షాలు ఎవరికివారే పెద్దన్న పాత్రకోసం అంగలు చాచడం మొదలుపెట్టాయి. జాతీయ స్థాయిలో కాషాయపార్టీకి నిజమైన ప్రత్యర్థి, విపక్ష కూటమిలో అసలైన పెద్దన్న పాత్ర పోషించాల్సిన కాంగ్రెస్‌ను తగ్గువచేసి చూడటం ప్రారంభించాయి. కూటమి పొత్తుల్లో భాగంగా జరగాల్సిన కీలకమైన సీట్ల పంపిణీ ప్రక్రియలో ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పట్ల కనుబొమలు ఎగరేయ సాగాయి. ఒక్కమాటలో చెప్పాలంటే బిక్ష వేస్తాం.. ఒకటో రెండో సీట్లతో సరిపెట్టుకోండి అనే స్థాయికి చేరాయి. ఈ విషయంలో పాతమిత్రుల కంటే ఆమ్ ఆద్మీ పార్టీ చాలా చాలా రెట్లు మేలనే చెప్పాలి. మొదట బీష్మించినా ఢిల్లిలో కాంగ్రెస్‌కు మూడు ఎంపీ సీట్లు ఇవ్వడానికి ముందుకొచ్చింది. అలాగే హర్యానా, గుజరాత్‌లోనూ కేజ్రీవాల్ పార్టీ కాస్తంత కనికరంగానే వ్యవహరించింది. పంజాబ్ విషయాన్ని మినహాయిస్తే, మొత్తంగా కూటమిలో పొత్తు ధర్మానికి, మిత్ర ధర్మానికి కట్టుబడిన పార్టీగా ఆమ్ ఆద్మీని మెచ్చుకుని తీరాలి. అలాగే మొదట మొండికేసినప్పటికీ యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ కూడా కాంగ్రెస్ పాత్రను గుర్తించారు. యూపీలో గత ఎన్నికల్లో గొప్ప ప్రదర్శన చేయనప్పటికీ, హస్తం పార్టీకి సముచిత స్థానాలిచ్చి గౌరవించారు. ఉభయ కుశలోపరిగా వ్యవహరించారు. బీజేపీని ఓడించాలనే లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలన్న సంకల్పనం అఖిలేశ్‌లో కొంతవరకు కనిపించిందని చెప్పాలి.
అయితే, దేశంలో దాదాపు ఉనికి కోల్పోయిన సీపీఐ, బెంగాల్‌కు వెలుపల ప్రభావం చూపలేని తృణమూల్ కాంగ్రెస్‌తోపాటు కాశ్మీర్‌లో అస్తిత్వ పోరాటం చేస్తున్న ఫరూఖ్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల వైఖరే పొత్తు ధర్మానికి తూట్లు పొడిచేలా ఉంది. వారిది అతి విశ్వాసమో, ఆత్మవిశ్వాసమో లేక లోలోన మోడీకి అనుకూల వైఖరో తెలీదు కానీ, మొత్తానికి కాంగ్రెస్‌ను కూరలో కరివేపాకులా చూస్తున్నాయి. తమ రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటూ ఇవ్వడానికి ససేమిరా అంటున్నాయి. ఇది విపక్ష కూటమి ప్రధాన ఉద్దేశాన్ని దెబ్బతీసేలా ఉంది. ఈ క్రమంలో దాదాపు 2,350 కిలోమీటర్ల దూరంలో ఉన్న రెండు రాష్ట్రాల్లో (కేరళ, బెంగాల్) జరిగిన పరిణామాలు కూటమిలో సీట్ల పంపిణీ ప్రక్రియ అంత తేలికైన విషయం కాదని తేల్చాయి. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కంచు కోటలుగా పరిగణించబడుతున్న, సిట్టింగ్ స్థానాలను సైతం ఆ పార్టీకి ఇవ్వడానికి మిత్రులు ఒప్పుకోవడం లేదంటే పరిస్థితి ఎంత సంక్లిష్టంగా ఉందో అర్దం చేసుకోవచ్చు. ఈ రెండు సీట్లలో ఒకటి కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం. ఇక్కడ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ సీపీఐ పార్టీ జాతీయ నాయకుడు అన్నీ రాజాను పోటీకి దింపింది. ఇక రెండవ స్థానం బెంగాల్‌లోని బహ్రంపూర్. లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్‌రంజన్ చౌదరి ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఇటీవల మొత్తం 42 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీఎంసీ, మిత్రపక్షం సిట్టింగ్ స్థానమైన బ్రహంపూర్‌లో తమ పార్టీ అభ్యర్థిగా మాజీ క్రికెటర్ యుసుఫ్ పఠాన్ పేరును ప్రకటించడం కాంగ్రెస్‌ను విస్మయానికి గురిచేసింది.
Congress : దీదీ కోపానికి కారణమేంటి ?
పశ్చిమ బెంగాల్‌లో మొదట మమతా బెనర్జీ కాంగ్రెస్‌కు రెండు సీట్లు ఇవ్వడానికి అంగీకరించింది. అయితే, కాంగ్రెస్ రెండంకెల స్థానాలకు పట్టుబట్టడంతో దీదీ ఆగ్రహం నషాళానికి చేరినట్లయి, మొదటికే సున్నా చుట్టేసింది. కాదుకూడదంటే డార్జిలింగ్ సహా టీఎంసీ ఎప్పటికీ గెలవని మరో రెండు సీట్లు ఇవ్వడానికి మమత అంగీకరించే వారని ఆమె సన్నిహితులు చెప్పుకొచ్చారు. బదులుగా అస్సాం, మణిపూర్, మేఘాలయ రాష్ట్రాల్లో తమకూ కొన్ని సీట్లివ్వాలని దీదీ కోరినట్లు సమాచారం. కానీ, కాంగ్రెస్ తొందపాటుగా వ్యవహరించి మేఘాలయలో తమ అభ్యర్థులను ప్రకటించేసింది. ఇదికూడా టీఎంసీ అధినేత్రి ఆగ్రహానికి మరొక కారణమని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. ఇక్కడ ఇంకొక వాదన కూడా వినిపిస్తోంది. మోడీ మరోసారి ప్రధాని కావడం తథ్యమనే ప్రచారం నేపథ్యంలో, వీలైనంత మేరకు లోక్‌సభలో తన బలాన్ని పెంచుకోవాలని మమత యోచిస్తున్నట్లు తృణమూల్ నేతలు చెబుతున్నారు. అందుకే కాంగ్రెస్‌తో మరీ పేచీకి దిగాల్సి వచ్చిందంటున్నారు. వాస్తవానికి రాజీవ్ నుంచి సోనియా వరకు మమతకు మంచి సంబంధాలే ఉన్నాయి. ఎటొచ్చీ రాహుల్‌తోనే ఎక్కడో కాస్తంత బెడిసింది. బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లి, గుజరాత్, హర్యానా, గోవాలలో సీట్ల సర్దుబాట్లను చేరుకోగలిగిన కాంగ్రెస్‌కు పంజాబ్, పశ్చిమ బెంగాల్ సవాల్‌గా మారాయి. నిజానికి కాంగ్రెస్‌తో దోస్తీ చేస్తున్న చాలా పార్టీలు అందులో నుంచి బయటపడ్డ నేతలే స్థాపించినవే. 1998లో బెనర్జీ తన మద్దతుదారులతో కలిసి కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత టిఎంసిని ఏర్పాటు చేశారు.
Congress : అధిర్ వర్సెస్ యూసుఫ్
యూసుఫ్ పఠాన్ మాజీ క్రికెటర్. ఒక మెజీషియన్ కుమారుడు. బరోడాలో జన్మించాడు 2011 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు. అధిర్ రంజన్ విషయానికొస్తే బహ్రంపూర్ స్థానానికి 1999 నుండి ప్రాతినిధ్యం వ#హస్తున్నాడు. ప్రస్తుతం లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు.. విపక్ష నేత కూడా. ఆయన అంతకుముందు ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో రైల్వే మంత్రిత్వ శాఖలో కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు. 2014లో పశ్చిమ బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. బిజెపికి వ్యతిరేకంగా ఏకీకృత ప్రతిపక్ష కూటమి కోసం కాంగ్రెస్ #హకమాండ్ టీఎంసీ పట్ల మెతక వైఖరి అనుసరిస్తున్నప్పటికీ, అధిర్‌రంజన్ చౌదరి మాత్రం ఎక్కడ అవకాశం వచ్చినా మమతా బెనర్జీపై విమర్శలు సంధించడంలో ఏమాత్రం వెనకంజ వేసేవారు కాదు. అధిర్ రంజన్ తన పట్టును కిందటి ఎన్నికల్లో కొంత వరకు కోల్పోయాడు. 1999 నుంచి పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చాడు. 2014 ఎన్నికల్లో 3.5 లక్షల మెజారిటీతో నెగ్గారు. కానీ గత ఎన్నికల్లో మాత్రం ఈ మెజారిటీ 81 వేలకు పడిపోయింది. ఈ నియోజకవర్గం మొత్తం జనాభాలో 63శాతం ఓటర్లు ముస్లింలే. ఇలాంటి చోట యూసుఫ్ పఠాన్‌ను రంగంలోకి దించడం ద్వారా దీదీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అయితే విశ్లేషకులు మాత్రం మమత నిర్ణయం బీజేపీకి మేలు చేసేదిగా ఉందని పేర్కొంటున్నారు. పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్లు అవుతుందని చెబుతున్నారు.
Congress : టీఎంసీ అభ్యర్థులలో ముఖ్యులు..
కీర్తి ఆజాద్ బీహార్ మాజీ ముఖ్యమంత్రి భగవత్ ఝా ఆజాద్ కుమారుడు (1988–1989). 1983 ప్రపంచ కప్ విజేత జట్టులో సభ్యుడు. బర్ధమాన్-దుర్గాపూర్ నియోజకవర్గం నుంచి టీఎంసీ అభ్యర్థిగా ఆయన టిక్కెట్ సంపాదించారు. 2019లో బీజేపీకి చెందిన ఎస్‌ఎస్ అ#్లహువాలియా ఈ స్థానంలో గెలిచారు. టీఎంసీ సుప్రీం లీడర్ దీపక్ అధికారి ఘటల్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగుతున్నారు. అలాగే ప్రముఖ టీవీ షో #హూస్ట్ రచనా బెనర్జీని హుబ్లి స్థానానికి నామినేట్ చేశారు. ఆమె తోటి సినీ నటుడు, బిజెపి ఎంపి లాకెట్ ఛటర్జీతో పోటీ పడుతుంది. మరో సినీ నటుడు ఎమ్మెల్యే జూన్ మాలియా మిడ్నాపూర్ నుండి టీఎంసీ అభ్యర్థిగాను, ”ఖేలా హూబ్” అనే పేరును రూపొందించిన దేబాంషు భట్టాచార్యను తవ్లుుక్ నుండి బరిలోకి దింపారు.