తెలంగాణ‌లో వైఎస్ఆర్ కు ఉన్న‌ ఆత్మ‌గౌర‌వం ఎన్టీఆర్‌కు లేదా.. ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

తెలంగాణ‌లో వైఎస్ఆర్ కు ఉన్న‌ ఆత్మ‌గౌర‌వం ఎన్టీఆర్‌కు లేదా.. ?

 Authored By himanshi | The Telugu News | Updated on :21 May 2021,7:00 am

telangana సినిమా లో స్టార్ గా వెలుగు వెలుగుతున్న సమయంలో నందమూరి తారక రామారావు తెలుగు దేశం పార్టీని ఏర్పాటు చేశారు. తెలుగు వారి ఆత్మగౌరవం పేరుతో ఏర్పాటు అయిన పార్టీ తెలుగు దేశం పార్టీ. అప్పటి కాంగ్రెస్ పార్టీ తెలుగు వారికి కనీస ఆత్మగౌరవం ఉందని గుర్తించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్‌ పార్టీని ఏర్పాట్లు చేశాడు. పార్టీ అవసరం చాలా ఉన్న సమయంలో తెలుగు దేశం పార్టీ వచ్చింది. రికార్డు స్థాయిలో అతి తక్కువ సమయంలో అధికారంలోకి వచ్చిన తెలుగు దేశం పార్టీ మళ్లీ మళ్లీ అధికారంలో కూర్చుంది. ఎన్టీఆర్‌ తీసుకున్న నిర్ణయాల వల్లో లేదా మరేంటో కాని తెలుగు దేశం పార్టీ చంద్రబాబు నాయుడు చేతిలోకి వచ్చింది. చంద్రబాబు కూడా తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో ముందుకు వెళ్లాడు.

రాష్ట్రం విడిపోయాక పరిస్థితి మార్పు.. telangana

చంద్రబాబు నాయుడు మరియు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఇద్దరు కూడా రాష్ట్రం విడిపోవడానికి ఇష్టపడలేదు. సాధ్యం అయినంతగా వారు తెలుగు రాష్ట్రం ఉమ్మడిగా ప్రయత్నించారు. కాని రాజశేఖర్‌ రెడ్డి మృతి చెందడం ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామల కారణంగా రాష్ట్రం విడిపోక తప్పలేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగు దేశం పార్టీ రెండు రాష్ట్రాల్లో ఉంటుందని అంతా అనుకున్నారు.

ntr and ys rajasekhar reddy politics in telangana

ntr and ys rajasekhar reddy politics in telangana

కాంగ్రెస్ కు ఏపీలో ఎలాంటి పరిస్థితి ఏర్పడిందో తెలంగాణలో తెలుగు దేశం పార్టీకి దారుణమైన పరిస్థితి ఏర్పడింది. వైకాపా ను తెలంగాణలో బలపర్చాలనే ఉద్దేశ్యం ను పక్కన పెట్టిన జగన్‌ తన సోదరిని రంగంలోకి దించి తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పేలా ప్రయత్నాలు చేస్తున్నాడు. కాని చంద్రబాబు నాయుడు మాత్రం ఆ విధంగా చేయడంలో విఫలం అయ్యాడు.

తెలంగాణలో తూడ్చిపెట్టుకు పోయింది..

టీడీపీ అంటేనే ఆత్మ గౌరవం కోసం ఏర్పడిన పార్టీ. తెలుగు వారు telangana తెలంగాణలో కూడా ఉన్నారు కనుక ఇక్కడ అక్కడ అన్ని చోట్ల కూడా పార్టీని బలపర్చాల్సిన అవసరం ఉంది. కాని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం తెలంగాణలో పార్టీని పూర్తిగా వదిలేశాడు. ఆమద్య అసెంబ్లీ ఎన్నికల సమయంలో మొన్నటి ఉప ఎన్నికల సమయంలో తెలుగు దేశం పార్టీ కనిపించలేదు. పార్టీ నాయకులు ఎవరు కూడా ప్రచారం చేయలేదు. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తే ఖచ్చితంగా టీడీపీకి బలం చేకూరే అవకాశం ఉంది. కాని ఆయన మాత్రం తెలంగాణతో సంబంధం లేదు అన్నట్లుగా ఏపీకే పరిమితం అయ్యాడు. టీడీపీ కేవలం ఏపీ వారి ఆత్మగౌరవం కాపాడే పనిలో పండింది.

Tags :

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది