YS Jagan : జగన్ పేరు చెప్పగానే ఆ పెద్దాయన ఎమోషనల్ ఐపోయాడు.. ఇలాంటి సీన్ జన్మలో మిస్ అవ్వకండి..!
YS Jagan : ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వం అక్కడి బడుగు, బలహీన వర్గాలను ఆదుకున్నప్పుడే ఆ ప్రభుత్వం నిఖార్సయిన ప్రభుత్వం అని చెప్పుకోవాలి. పేదల కోసం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడమే కాకుండా.. వాళ్లకు ఆర్థికంగా చేయూతను అందించారు. ప్రభుత్వం ఉన్నన్ని రోజులు తమకు ఎలాంటి భయం అవసరం లేదు అనే భరోసాతో పేదలు బతకాలి. అలాంటి పరిస్థితులే ప్రస్తుతం ఏపీలో ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం పనితీరును ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు. సీఎం జగన్ ను చూసి ప్రతి ఒక్కరు శభాష్ అంటున్నారు. దానికి కారణం..
ఆయన తీసుకొచ్చిన పలు సంక్షేమ పథకాలు. అసలు సొంత మనుషులే పట్టించుకోని రోజులు ఇవి. సొంత కొడుకులు, కూతుళ్లే సొంత తల్లిదండ్రులకు తిండి పెట్టని రోజులు ఇవి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి నెలా ఒకటో తేదీకే జీతం వేసినట్టుగా వాలంటీర్ల ద్వారా పెన్షన్ డబ్బును వృద్ధులకు అందించి తమ కడుపులు నింపుతున్నారని.. పిల్లల ఆదరణ లేని వేల మంది వృద్ధులను సొంత కొడుకులా సీఎం జగన్ ఆదుకుంటున్నారని పెన్షన్ తీసుకుంటున్న వృద్ధులు సీఎం జగన్ ను కొనియాడుతున్నారు. మాకు దిక్కు ఎవరు లేరు అని అనుకుంటున్న సమయంలో, సొంత వాళ్లే పట్టించుకోని ఈ నేపథ్యంలో ఒకటో తారీఖుకల్లా పెన్షన్ డబ్బులు ఇస్తూ..
YS Jagan : కన్నీరు పెట్టుకుంటున్న వృద్ధులు
ఎలాంటి జబ్బు చేసినా మంచి వైద్యం చేయించి ఆదుకుంటున్నారు అంటూ ఏపీ ప్రభుత్వంపై కృష్ణా జిల్లాకు చెందిన మోపిదేవి లీలాజలం అనే వృద్ధుడు సీఎం జగన్ పేరు చెప్పగానే భావోద్వేగానికి గురయ్యాడు. జగనన్నే మా భవిష్యత్ పేరుతో ప్రభుత్వం ప్రస్తుతం ఇంటింటికి వెళ్లి ప్రజలను సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని అడుగుతోంది. ఈనేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 85 ఏళ్ల వయసు ఉన్న మోపిదేవి లీలాజలం అనే వృద్ధుడు.. సీఎం జగన్ గురించి చెప్పగానే.. భావోద్వేగానికి గురయ్యాడు. జగన్ సీఎం అయ్యారు కాబట్టే.. తమ లాంటి వృద్ధులు నేడు సంతోషంగా మూడు పూటలా తిండి తినగలుగుతున్నారంటూ కన్నీరు పెట్టుకున్నాడు.