OnePlus : స్మార్ట్ టీవీలపై బంపర్ ఆఫర్…కేవలం రూ.15,000లకే వన్ ప్లస్ టీవీ… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

OnePlus : స్మార్ట్ టీవీలపై బంపర్ ఆఫర్…కేవలం రూ.15,000లకే వన్ ప్లస్ టీవీ…

 Authored By aruna | The Telugu News | Updated on :22 August 2022,4:00 pm

OnePlus : వన్ ప్లస్ సంస్థ అనేక స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే భారతీయ మార్కెట్లో వన్ ప్లస్ కి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇప్పటివరకు వన్ ప్లస్ నుంచి రిలీజ్ అయిన అన్ని స్మార్ట్ ఫోన్లు కూడా చాలా తక్కువ ధరతో అద్భుతమైన ఫీచర్లతో వినియోగదారులను బాగా ఆకర్షిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ లాగా స్మార్ట్ టీవీలు కూడా భారతీయ మార్కెట్లో భారీ డిమాండ్ సొంతం చేసుకుంది. ఇక తాజా సమాచారం ప్రకారం వన్ ప్లస్ స్మార్ట్ టీవీ పై ప్రముఖ సంస్థ ఫ్లిప్కార్ట్ అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది.

ఫ్లిప్కార్ట్ లో ప్రస్తుతం టాప్ డీల్ సేల్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ సేల్ లో భాగంగా వన్ ప్లస్ వై వన్ 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ ని తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం వన్ ప్లస్ వై వన్ 32 హెచ్డి రెడీ ఎల్ఈడి స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ పై 5000 వరకు తగ్గింపు ఆఫర్లు ప్రకటించారు. ముఖ్యంగా ఈ స్మార్ట్ టీవీలు అసలు ధర 19,999 కాగా ఫ్లిప్కార్ట్ అందిస్తున్న టాప్ డీల్స్ లో భాగంగా 25 శాతం తగ్గింపుతో 14999 రూపాయలకు ఈ స్మార్ట్ టీవీ ని సొంతం చేసుకోవచ్చు. అది కూడా లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కూడా విధించడం జరిగింది. ఇక ఆఫర్ లోపు కొనుక్కునేవారికి 15 వేల లోపే ఈ స్మార్ట్ టీవీ సొంతమవుతుంది.

Get OnePlus Smart TV In Just 15000 Rs This Is A Super Offer

Get OnePlus Smart TV In Just 15000 Rs This Is A Super Offer

అంతేకాదు ఈ స్మార్ట్ టీవీ పై బ్యాంక్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ముఖ్యంగా యాక్సిస్ బ్యాంక్ కార్డు ద్వారా ఐదు శాతం తగ్గింపును పొందవచ్చు. అంతేకాదు నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ప్రతి నెల 2,500 చొప్పున పే చేస్తే కొనుగోలు చేయొచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద 9,000 వరకు ఆదా కూడా లభిస్తుంది. పాత స్మార్ట్ టీవీ ని ఎక్స్చేంజ్ ఆఫర్ కింద ఇస్తే వన్ ప్లస్ వై వన్ స్మార్ట్ టీవీ ని కేవలం 5999కే సొంతం చేసుకోవచ్చు. అయితే పాత స్మార్ట్ టీవీ కండిషన్స్ బాగుంటే 9000 రూపాయల వరకు వర్తిస్తుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది