YS Jagan : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.. వైఎస్ జగన్ మాస్టర్ ప్లాన్ అదుర్స్.!
YS Jagan : తమదైన అసత్యాలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అలజడి సృష్టిస్తున్నాయి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ. భారతీయ జనతా పార్టీ తక్కువేమీ కాకపోయినా, ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వున్న ‘వాటా’ చాలా చాలా తక్కువ గనుక, ఆ పార్టీని అంత సీరియస్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏనాడూ తీసుకోలేదు. వాస్తవానికి జనసేన పార్టీని కూడా వైసీపీ లైట్ తీసుకుంటున్నప్పటికీ, తెలుగుదేశం పార్టీని ఉద్ధరించడం కోసం జనసేన చేస్తున్న ఓవరాక్షన్ నేపథ్యంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒకింత సీరియస్‌గానే స్పందించాల్సి వస్తోంది. రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికల నిమిత్తం మొత్తం నాలుగు స్థానాల్లో రెండు బీసీలకు కేటాయించడం ద్వారా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, విపక్షాలకు ఈ విషయమై ప్రభుత్వాన్నివిమర్శించేందుకు ఛాన్స్ లేకుండా చేసేశారు.
ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు రెండు సీట్లను కట్టబెట్టినప్పటికీ, అదే పరిమాణంలో బసీలకూ రాజ్యసభ అవకాశాన్ని కల్పించడం ద్వారా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో బీసీలకు స్పష్టమైన సంకేతాలు పంపారు.. తమది బీసీ ఫ్రెండ్లీ పార్టీ అని. మరీ ముఖ్యంగా బీసీ నేత ఆర్ కృష్ణయ్య అంటే, బీసీ వర్గాల్లోనే కాదు, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల్లోనూ, ఆ మాటకొస్తే అన్ని సామాజిక వర్గాల్లోనూ ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం వున్నాయి. ఇక, ఈ విషయంలో వైసీపీని టీడీపీ కావొచ్చు, జనసేన కావొచ్చు విమర్శించడానికే అవకాశం లేదు. వచ్చే ఎన్నికల్లో బీసీ ఓటు బ్యాంకు గంప గుత్తగా వైసీపీకి పడేందుకు రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ఎంతగానో ఉపకరిస్తుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, తెలంగాణ రాజకీయాల్లో కూడా ఈ వ్యవహారం అలజడి రేపుతోంది.
ఆర్.కృష్ణయ్య తెలంగాణకు చెందిన నేత. ప్రముఖ న్యాయవాది నిరంజన్ రెడ్డి కూడా తెలంగాణకు చెందినవారే. దాంతో, తెలంగాణ రాజకీయాల్లోనూ వైసీపీ తనదైన రీతిలో అలజడి రేపిందనే చర్చ రాజకీయ విశ్లేషకుల్లో జరుగుతోంది. ఇది తెలంగాణలో షర్మిల నడుపుతున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీకి ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయితే, రాజ్యసభ అంటే.. అది దేశవ్యాప్త ఎన్నికల అంశమనీ, తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ అన్న ప్రత్యేక ప్రస్తావన ఆర్.కృష్ణయ్య, నిరంజన్ రెడ్డి విషయంలో తీసుకురావడం సమంజసం కాదని, రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.