OnePlus Nord CE 2 Lite : చైనీస్ మొబైల్ సంస్థ తక్కువ ధరకే మంచి ఫీచర్స్‌తో 5 జీ ఫోన్ అందించేందుకు సిద్ధమైంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ మొబైల్‌తో బడ్జెట్ 5జీ ఫోన్లకు పోటీనివ్వాలని ప్లాన్ చేస్తోంది. దేశీయంగా ఇటీవల విడుదలైన వన్‌ప్లస్ నార్డ్ సీఈ2 5జీ స్మార్ట్ఫోన్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ మొబైల్‌ను వన్‌ప్లస్ వెబ్సైట్, వన్ ప్లస్ స్టోర్ యాప్, వన్ ప్లస్ ఎక్స్పీరియన్స్ స్టోర్స్ సహా అధికారిక డీలర్షిప్ పార్ట్నర్స్ దగ్గర ఈ ఫోన్ విక్రయాలకు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. ఈ మొబైల్ వెనుక రెక్టాంగులర్ షేప్‌లో కెమెరా సెటప్ ఉంటుంది. దీంట్లో మూడు కెమెరాలు, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. ఇక ఫోన్ రౌండెడ్ అంచులతో వస్తుంది.
దీని ద్వారా చేతిలో ఫోన్‌ను పట్టుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ లైట్ వెర్షన్‌కు అలెర్ట్ స్లైడర్ ఉండదు.వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ మొబైల్ 6.5 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఫ్లూయిడ్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుందని సమాచారం. అలాగే 90 హెట్జ్ లేదా 120 హెట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ మొబైల్ స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌తో వస్తుందని సమాచారం. అలాగే 6 జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్లు రావొచ్చు. 64 ఎంపీ ఓమ్నీ విజన్ ప్రధాన కెమెరా, 2 ఎంపీ మాక్రో సెన్సార్, 2 ఎంపీ మాక్రో లెన్స్ ఉండే అవకాశం ఉంది. అలాగే 16 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో ఈ ఫోన్ రావొచ్చు.5000ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌తో ఈ మొబైల్ విడుదల కానుందని లీకుల ద్వారా వెల్లడైంది. 5జీ, 4జీ ఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.1, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ లాంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉంటాయి.
ఫస్ట్ సేల్ సందర్భంగా వన్‌ప్లస్ నార్డ్ సీఈ2 5జీ ఫోన్‌ను కొనే వారికి.. ప్రత్యేక ఆఫర్లు ఇచ్చింది కంపెనీ. ఈ ఫోన్‌తో పాటు రూ.699కి వన్ ప్లస్ బ్యాండ్, రూ.999కి వన్ ప్లస్ బుల్లెట్స్ వైర్లెస్ జెడ్ బాస్ ఎడిషన్‌ను సొంతం చేసుకోవచ్చని వెల్లడించింది. పాత ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.3 వేల వరకు తగ్గింపు పొందొచ్చు. ఈ ఆఫర్ ఫిబ్రవరి 22-28 వరకు అందుబాటులో ఉండనుంది. అన్ని ప్లాట్‌ఫామ్స్‌పై ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చు.వీటితో పాటు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లు జరిపే వారికి రూ.1,500 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.