OnePlus : రూ.20 వేల లోపు ధరతో వన్‌ప్లస్ నార్డ్ ఫోన్.. స్పెసిఫికేషన్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు…!
OnePlus : ఫ్లాగ్‌షిప్ రేంజ్‌లో సక్సెస్ అయిన వన్ ప్లస్.. రూ.20వేలలోపే ఓ నార్డ్ స్మార్ట్‌ఫోన్ తీసుకురానుంది. ఎంతో డిమాండ్ ఉన్న బడ్జెట్ రేంజ్‌లో ఈ ఫోన్‌ను తీసుకొచ్చి మార్కెట్ ను పెంచుకునేందుకు ప్లాన్ చేస్తోంది. 5జీ కనెక్టివిటీతో ఈ తక్కువ ధర మొబైల్ లాంచ్ చేయనుంది. ఈ రూ.20వేలలోపు ధరతో రానున్న వన్‌ప్లస్ నార్డ్ ఫోన్ స్పెసిఫికేషన్లు లీకయ్యాయి. ప్రస్తుతం ఈ చౌకైన వన్‌ప్లస్ నార్డ్ మొబైల్ తయారీ ప్రారంభ దశలో ఉంది.ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్లు బయటికి వచ్చాయి. ముఖ్యంగా 90హెట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండే అమోలెడ్ డిస్‌ప్లేతో ఈ స్మార్ట్‌ఫోన్ రానుంది. అలాగే 5జీ కనెక్టివిటీ, మీడియాటెక్ ప్రాసెసర్‌తో వస్తుంది.
మరోవైపు ఈ వన్‌ప్లస్ తక్కువ ధర ఫోన్ వెనుక 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో రానుందని సమాచారం. వన్‌ప్లస్ నార్డ్ ఫోన్ రూ.20వేలలోపు విభాగంలో విడుదలైతే రియల్‌మీ, షియోమీ, సామ్‌సంగ్, ఒప్పో, వివో మొబైళ్లకు తీవ్ర పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.ఇటీవలే భారత్‌లో వన్‌ప్లస్ 9ఆర్టీ మొబైల్ లాంచ్ అయింది. రూ.40వేలలోపు ధరలో ఫ్లాగ్‌షిప్ స్పెసిఫికేషన్లతో ఈ ఫోన్ వచ్చింది. అలాగే చైనాలో ఈ నెలలోనే వన్‌ప్లస్ 10 ప్రో లాంచ్ అయింది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ఫోన్ కూడా త్వరలో భారత్‌కు రానుంది. మొత్తంగా 2022లో దూకుడును మరింత పెంచనుంది వన్‌ప్లస్. అన్ని విభాగాల్లో ఫోన్లను లాంచ్ చేసి మార్కెట్ ను పెంచుకునేందుకు మాస్టర్ ప్లాన్ వేసింది.

oneplus nord series mobile tipped launch in india
వన్ ప్లస్ నార్డ్ స్పెసిఫికేషన్లు
పెర్ఫార్మెన్స్ Qualcomm Snapdragon 765G
డిస్_ప్లే 6.44 inches (16.36 cm)
స్టోరేజ్_ఫైల్ 64 GB
కెమెరాా 48 MP + 8 MP + 5 MP + 2 MP
బ్యాటరీ 4115 mAh
భారతదేశంలో ధర 24999
ర్యామ్ 6 GB, 6 GB