Onion Juice : ఆనియన్ జ్యూస్.. దీన్నే మనం ఉల్లిపాయ రసం అంటాం. నిజానికి.. ఉల్లిగడ్డ చేసే మేలు తల్లి కూడా చేయదంటారు పెద్దలు. అది నిజమే. ఉల్లిగడ్డలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఉల్లిగడ్డను తినడం వల్ల.. ఎన్నో ఆరోగ్య సమస్యలు నయం అవుతాయి. అందుకే.. ఉల్లిపాయలను రోజూ కూరల్లో వేసుకొని వండుకొని తింటాం. ఏ ఆహారమైనా అందులో ఉల్లిగడ్డ ఉండాల్సిందే. చిరుతిళ్లలోనూ ఊల్లిపాయ ముక్కలు ఉండాల్సిందే. అది ఉల్లిపాయకు ఉన్న క్రేజ్.
ఉల్లిగడ్డ మాత్రమే కాదు.. ఉల్లిపాయ రసంలోనూ చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవును.. ఎన్నో రకాల సమస్యలను కేవలం ఉల్లి రసంతో చెక్ పెట్టొచ్చు. ఇంతకీ ఉల్లిపాయ రసంతో ఎటువంటి ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం రండి.
ఉల్లిగడ్డలో యాంటీ ఆక్సిడెంట్ ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. వాటినే క్వెర్ సెటిన్ అని పిలుస్తారు. అది మెటబాలిజం రేటును పెంచుతుంది. దాని వల్ల.. శరీరంలో పేరుకుపోయి ఉన్న కొవ్వు కరుగుతుంది. ఉల్లిగడ్డలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. సోడియం కంటెంట్ కూడా తక్కువగా ఉంటుంది. అందుకే.. ఉల్లిగడ్డను ఖచ్చితంగా ప్రతి కూరలో వేసుకొని తింటారు.
చాలామంది తమ పొట్టను తగ్గించుకోవాలని అనుకుంటారు. పొట్ట బాగా ఎక్కువగా ఉన్నవాళ్లు.. ఉల్లిపాయ రసాన్ని తేనెతో కలిపి నిత్యం తీసుకోవాలి. అలా చేస్తే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు మొత్తం కరిగిపోతుంది. దానికోసం.. ఉల్లిపాయ రసాన్ని ఎలా తయారు చేయాలంటే… ఉల్లిగడ్డను తీసుకొని.. ముక్కలు ముక్కలుగా చేసి.. మిక్సీలో వేసి బాగా మొత్తగా చేసి.. ఆ మిశ్రమాన్ని నీటిలో వేసి కలపాలి. దాంట్లో కాసింత తేనె వేసి నిత్యం తాగుతూ ఉండాలి. ఈ పానీయాన్ని ఉదయమే పరగడుపున తాగాలి. దీంతో పొట్ట తగ్గుతుంది.
ఉల్లిపాయ రసం తాగడం వల్ల.. పొట్ట తగ్గడం మాత్రమే కాదు.. జలుబు ఉన్నా.. దగ్గు ఉన్నా.. జ్వరం వచ్చినా కూడా మంచి ఫలితం ఉంటుంది. మొటిమలు ఎక్కువగా ఉన్నవాళ్లు.. ఉల్లిరసాన్ని నిత్యం తీసుకోవాలి. ఉల్లిగడ్డ రసాన్ని తీసుకుంటే.. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బ్లడ్ షుగర్ లేవల్స్ కూడా కంట్రోల్ లో ఉంటాయి. మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఉల్లిపాయ రసంతో తగ్గించవచ్చు.
ఇది కూడా చదవండి ==> రోజురోజుకూ పెరుగుతున్న షుగర్ వ్యాధి.. అసలు షుగర్ వచ్చిందని ఎలా తెలుసుకోవాలి?
ఇది కూడా చదవండి ==> హై బీపి ఉన్నవారు ఉప్పుకు బదులు ఇవి వాడండి.. ?
ఇది కూడా చదవండి ==> బీపీ చెక్ చేసుకునే ముందు ఈ పనులు మాత్రం అస్సలు చేయకండి..!
ఇది కూడా చదవండి ==> పెరుగు అంటే అస్సలు పడదా..? అయితే ఈ ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోయినట్టే..!
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
This website uses cookies.