Curd : పెరుగు అంటే అస్సలు పడదా..? అయితే ఈ ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోయినట్టే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Curd : పెరుగు అంటే అస్సలు పడదా..? అయితే ఈ ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోయినట్టే..!

 Authored By jagadesh | The Telugu News | Updated on :18 July 2021,8:07 pm

Curd : చాలామందికి పెరుగంటేనే పడదు. పెరుగు పేరు ఎత్తితేనే యాక్ అంటారు. పెరుగు, మజ్జిగ ఇలా ఏదీ తినరు. కనీసం తమ జీవితంలో ఒక్కసారి కూడా పెరుగును టేస్ట్ చేయని వాళ్లు ఉన్నారు. పెరుగును సింపుల్ గా వద్దు అంటారు. ఇంకొందరైతే.. పెరుగు తింటే జలుబు చేస్తుందని.. బరువు పెరుగుతామని భ్రమ పడతారు. అందుకే.. పెరుగును ముట్టుకోరు. ఇంకొందరికి పెరుగు అస్సలు పడదు. చిన్నప్పటి నుంచి కొందరికి అలవాటు ఉండదు. ఇలా.. పలు రకాల కారణాలతో పెరుగును పక్కన పెట్టేవాళ్లు మాత్రం చాలా ఆరోగ్య ప్రయోజనాలను మిస్ అవుతున్నారు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

curd and butter milk health benefits telugu

curd and butter milk health benefits telugu

పెరుగులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ప్రతి రోజు కనీసం ఒక్కసారి అయినా పెరుగును తినాల్సిందే. అలా తింటేనే చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. లేదంటే చాలా నష్టం. అసలు.. పెరుగు వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. ఈ కథనం చదివాక.. వెంటనే పెరుగు వేసుకొని తినేస్తారు.

Curd : పెరుగులో ఎన్ని విటమిన్లు, మినరల్స్ ఉంటాయో తెలుసా?

పెరుగులో ఎటువంటి మినరల్స్, విటమిన్లు ఉండవని చాలామంది అనుకుంటారు. కానీ.. పెరుగులో చాలా మినరల్స్ ఉంటాయి. కాల్షియం, భాస్వరం, ప్రొటీన్లు, లాక్టోస్ పెరుగులో ఉంటాయి. పెరుగులో ఉండే కాల్షియం వల్ల.. శరీరంలోని ఎముకలు దృఢంగా తయారు అవుతాయి. అలాగే.. దంతాలు కూడా గట్టి పడుతాయి. మెదడు చురుగ్గా పనిచేయాలంటే.. ఖచ్చితంగా పెరుగు తినాల్సిందే. పెరుగుతో పాటు.. మజ్జిగను కూడా రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి.

curd and butter milk health benefits telugu

curd and butter milk health benefits telugu

పెరుగును అలాగే తినకుండా.. పెరుగులో ఎండుద్రాక్షను కలుపుకొని తింటే.. విటమిన్ ఏ, బీ, సీ, బీ12 అందుతాయి. అలాగే.. పెరుగులో మిరియాల పొడిని కలుపుకొని తిన్నా.. జలుబు తగ్గుతుంది. పెరుగులో.. బెల్లం పొడి కూడా కలుపుకొని తినొచ్చు. వాతం ఉన్నా.. కఫం ఉన్నా పెరుగును తినండి. నీరసం ఉన్నా.. అలసటగా ఉన్నా.. పెరుగులో కాసింత చక్కెర కలుపుకొని తింటే శరీరానికి వెంటనే తగిన శక్తి లభిస్తుంది. హైబీపీ ఉన్నా కూడా రోజూ పెరుగు తినండి. పెరుగులో కాసింత తేనె కలుపుకొని తాగితే.. అల్సర్ తగ్గుతుంది. ఇన్ఫెక్షన్లు ఉన్నా కూడా పెరుగు, తేనె కలుపుకొని తాగండి.

curd and butter milk health benefits telugu

curd and butter milk health benefits telugu

అయితే.. పెరుగు కంటే కూడా మజ్జిగలో ఇంకా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మజ్జిగలో కాసింత నిమ్మరసం వేసుకొని తాగాలి. ఉప్పు, జీలకర్ర పొడి వేసుకొని తాగినా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే.. డీహైడ్రేషన్ సమస్య ఉన్నవాళ్లు.. మజ్జిగ తాగితే చాలామంచిది.

ఇది కూడా చ‌ద‌వండి ==> పాలు, పండ్లను కలిపి ఒకేసారి తింటే… ఏమౌతుందో తెలుసా?

ఇది కూడా చ‌ద‌వండి ==> వ‌ర్ష కాలంలో వ‌చ్చే ఏ వ్యాధులైన స‌రే… ఈ ఆరోగ్య‌ చిట్కాల‌ను పాలో అవ్వండి ?

ఇది కూడా చ‌ద‌వండి ==> పొట్టిగా ఉన్నవాళ్లు త్వరగా బరువు తగ్గరా? దానికి కారణం ఏంటో తెలుసా?

ఇది కూడా చ‌ద‌వండి ==> మహిళల కన్నా పురుషులే త్వరగా బరువు తగ్గుతారట.. దానికి కారణం ఏంతో తెలిస్తే నోరెళ్లబెడతారు?

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది