Diabetes Symptoms : రోజురోజుకూ పెరుగుతున్న షుగర్ వ్యాధి.. అసలు షుగర్ వచ్చిందని ఎలా తెలుసుకోవాలి?
Diabetes Symptoms : ప్రస్తుతం ప్రపంచాన్నే వణికిస్తున్న ఒకే ఒక వ్యాధి షుగర్. దాన్నే డయాబెటిస్ అంటున్నాం. మధుమేహం అన్నా కూడా అదే. పేరు ఏదైనా.. ఈ వ్యాధి మాత్రం ప్రస్తుతం అందరినీ గడగడలాడిస్తోంది. చాలామందికి షుగర్ వ్యాధి.. వంశపారపర్యంగా వస్తున్నా.. తమ జీవన విధానంలో వస్తున్న మార్పులు, మారుతున్న ఆహారపు అలవాట్ల వల్లనే షుగర్ వ్యాధి వస్తోంది. అందులోనూ ఈ జనరేషన్ లో షుగర్ వ్యాధి విపరీతంగా పెరిగిపోతోంది. ప్రతి పది మందిలో.. ఐదారుగురిని షుగర్ వ్యాధి వేస్తోంది. టెన్షన్ ఎక్కువగా ఉన్నా.. మానసిక ఒత్తిడి ఉన్నా.. డిప్రెషన్ లో ఉన్నా.. షుగర్ వస్తోంది.
అసలు.. షుగర్ కు ఈ రోజుల్లో వయసుతో పని లేదు. ఏ వయసు వారికైనా షుగర్ వచ్చేస్తోంది. దీంతో చాలామంది షుగర్ అంటేనే భయపడిపోతున్నారు. కొందరికైతే షుగర్ ఎప్పుడో వచ్చేస్తోంది కానీ.. వాళ్లు తమకు షుగర్ వచ్చింది అనే విషయాన్ని ముందే తెలుసుకోలేకపోతున్నారు. దీంతో షుగర్ లేవల్స్ ఎక్కువయి.. చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. అందుకే.. షుగర్ వచ్చిందో లేదో ముందే ఎలా తెలుసుకోవాలి? షుగర్ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Diabetes Symptoms : ఈ లక్షణాలు ఉంటే షుగర్ వచ్చినట్టే
చాలామందికి షుగర్ వచ్చేముందు.. కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాళ్ల శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి. దాన్ని బట్టి వాళ్లకు షుగర్ వస్తుందని తెలుసుకోవచ్చు. లేదా వాళ్లకు షుగర్ వచ్చిందని కూడా అనుకోవచ్చు. అయితే.. షుగర్ లో కొన్ని స్టేజ్ లు ఉంటాయి. ప్రీ డయాబెటిక్ స్టేజ్ అని ఒకటి ఉంటుంది. ఆ స్టేజ్ లో కొందరికి విపరీతంగా జుట్టు రాలుతుంది. ఇంకొందరు వెంట వెంటనే అలసట చెందుతారు. నీరసంగా ఉంటుంది. ఏ పని చేయలేకపోతారు. వెంటనే అలసి పోతుంటారు.
చర్మంపై మచ్చలు వచ్చినా.. ముడతలు వచ్చినా.. తరుచూ మూత్ర విసర్జనకు వెళ్లినా షుగర్ ఫస్ట్ స్టేజ్ లో ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. అలాగే.. మరికొందరికి.. తరుచూ తలనొప్పి రావడం, చేతులకు తిమ్మిర్లు ఎక్కడం, కాళ్లకు తిమ్మిర్లు ఎక్కడం లాంటి లక్షణాలు వస్తాయి. ఇలాంటి లక్షణాలు నిత్యం కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వెంటనే షుగర్ టెస్ట్ చేయించుకోవాల్సిందే. లేదంటే.. షుగర్ లేవల్స్ పెరిగిపోయి.. చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి.