Online Classes : తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం.. విద్యార్థులకు మళ్లీ డిజిటల్ క్లాసెస్.. ఎప్పటి నుంచంటే?
Online Classes : కరోనా కేసులు మళ్లీ బాగా పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సర్కారు పాఠశాల విద్యార్థులకు సెలవులను ఈ నెల 30 వరకు పొడిగించింది. ఈ క్రమంలోనే సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి పాఠశాల విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది
గతంలో కొవిడ్ నేపథ్యంలో కొద్ది రోజుల పాటు ఆన్ లైన్ క్లాసెస్ నిర్వహించారు. తాజాగా మరోసారి డిజిటల్‌గా క్లాసెస్ కండక్ట్ చేయాలని సర్కారు డెసిషన్ తీసుకుంది. 8,9,10వ తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించనున్నారు. తెలంగాణ సర్కారు జారీ చేసిన నోటీసు ప్రకారం.
Online Classes : విద్యార్థులు అకడమిక్ ఇయర్‌లో నష్టపోకూడదనే..
యాభై శాతం టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది మాత్రమే స్కూల్స్ కు హాజరు కావాల్సి ఉంటుంది. అకడమిక్ ఇయర్ ను స్టూడెంట్స్ లాస్ కాకుండా ఉండేందుకుగాను సర్కారు ఈ డెసిషన్ తీసుకుంది. ఇక ప్రైవేటు స్కూల్స్ ఇప్పటికే ఆన్‌లైన్ క్లాసులు కండక్ట్ చేస్తున్నాయి.