Warangal : ఆన్ లైన్ క్లాసెస్ కోసం కాకతీయ యూనివర్సిటీలో ప్రత్యేకంగా స్టూడియో ఏర్పాటు
Warangal : ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా విద్యాసంస్థలు ఆన్ లైన్ క్లాసుల్లోనే విద్యాబోధన చేస్తున్నాయి. అయితే.. ఆన్ లైన్ క్లాసుల్లో కొన్ని సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. అందుకే.. కాకతీయ యూనివర్సటీ సరికొత్త ఐడియాకు శ్రీకారం చుట్టింది. యూనివర్సిటీకి చెందిన యూజీ, పీజీ విద్యార్థుల కోసం స్టూడియోను నిర్మిస్తున్నట్టు ప్రకటించింది.
కరోనా వల్ల.. ఆన్ లైన్ లోనే విద్యబోధన చేస్తున్నామని.. దాని కోసమే.. ఆడియో, వీడియో ద్వారా విద్యాబోధన కోసం సపరేట్ గా స్టూడియోను నిర్మిస్తున్నట్టు కేయూ వీసీ తాటికొండ రమేశ్ వెల్లడించారు. దీనికి సంబంధించి.. యూనివర్సిటీ అధికారులతో ఆయన స్టూడియో నిర్మాణంపై చర్చించారు.
అదే విధంగా.. దూరవిద్య 2021 – 22 సంవత్సరానికి గాను.. డిగ్రీ, పీజీ కోర్సుల కోసం అడ్మిషన్ నోటిఫికేషన్ ను కూడా వీసీ విడుదల చేశారు. అయితే.. ఈసారి దూరవిద్య ద్వారా యూజీ, పీజీ కోర్సుల కోసం సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్టు ఆయన వెల్లడించారు. గత సంవత్సరం కరోనా వల్ల.. అర్హత పరీక్షను నిర్వహించలేదు. అదే విధంగా ఈ సంవత్సరం కూడా అర్హత పరీక్షను నిర్వహించకుండా.. కేవలం ఇంటర్మీడియెట్ క్వాలిఫై అయితే చాలు.. అడ్మిషన్ ను అందిస్తున్నామని దూర విద్య డిపార్ట్ మెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు.