
#image_title
Online Delivery | బెంగళూరులో మరోసారి ఆన్‌లైన్ డెలివరీ మోసం సంచలనంగా మారింది. యలచెనహళ్లికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రూ.1.86 లక్షలు ఖరీదు చేసే స్మార్ట్‌ఫోన్ స్థానంలో టైల్ ముక్క అందుకోవడం షాక్‌కు గురి చేసింది. వివరాల్లోకి వెళ్తే 43 ఏళ్ల టెకీ ఇటీవల అమెజాన్‌లో శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 మోడల్‌ను ఆర్డర్ చేశాడు. అక్టోబర్ 14న రూ.1.86 లక్షలు చెల్లించి ప్రీ-పెయిడ్ ఆర్డర్ చేసిన ఆయనకు అక్టోబర్ 19న పార్సిల్ డెలివరీ అయ్యింది.
మోసపోయాడుగా..
ఖరీదైన వస్తువు కావడంతో అనుమానాలు తలెత్తకుండా ఉండేందుకు కస్టమర్ అన్‌బాక్సింగ్ వీడియో రికార్డ్ చేశాడు. అయితే, బాక్స్ తెరిచే సరికి ఫోన్ బదులు ఒక తెల్లటి టైల్ ముక్క కనిపించింది! దీంతో షాక్‌కు గురైన కస్టమర్ వెంటనే డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP) లో ఫిర్యాదు చేశాడు. అనంతరం కుమార్ స్వామి లేఅవుట్ పోలీస్ స్టేషన్ లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు నమోదు చేశారు.
పోలీసులు ఐటీ చట్టంతో పాటు IPC సెక్షన్ 318(4), 319 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డెలివరీ ప్రక్రియలో ఎక్కడ మోసం జరిగిందనే అంశంపై క్లూస్ టీం, సైబర్ టీం సమగ్రంగా దర్యాప్తు చేస్తోంది. పార్సిల్ హ్యాండ్లింగ్‌లో పాల్గొన్న డెలివరీ సంస్థ, అవుట్‌సోర్సింగ్ పార్ట్‌నర్, గోదాం సిబ్బంది పై పోలీసులు దృష్టి సారించారు.
Banana | సాధారణ పసుపు అరటిపండ్లతో పోలిస్తే ఎర్ర అరటిపండ్లు (Red Bananas) ఆరోగ్య పరంగా మరింత శక్తివంతమని పోషకాహార…
Tea | ప్రపంచవ్యాప్తంగా టీ, కాఫీ ఇప్పుడు జీవితంలో విడదీయలేని భాగంగా మారాయి. ఉదయం లేవగానే ఒక కప్పు టీ లేదా…
Money | డబ్బు మనిషి జీవితంలో ఎంత ముఖ్యమో చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న అవసరం అయినా, పెద్ద కోరిక…
Apple | ఆపిల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే. “రోజుకు ఒక ఆపిల్ తింటే డాక్టర్ అవసరం…
Dates | చలికాలం రాగానే శరీరానికి తగినంత వేడి, శక్తి అందించే ఆహారం అవసరం అవుతుంది. ఈ సీజన్లో ఖర్జూరాలు…
Health Tips | శరీర ఆరోగ్యానికి కాల్షియం ఎంతో ముఖ్యమైన ఖనిజం. ఇది ఎముకలు, దంతాలను బలంగా ఉంచడమే కాకుండా…
Nails | మన గోళ్లపై కొన్నిసార్లు తెల్లని చుక్కలు లేదా మచ్చలు కనిపిస్తాయి. చాలామంది వీటిని కాల్షియం లోపం లేదా…
LIC | దేశంలో జీవిత బీమా రంగంలో అగ్రగామి సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) లో…
This website uses cookies.