అనాధ శవంగా తల్లి.. డబ్బులు కోసం అంత్యక్రియలు చెయ్యని బిడ్డలు..!!
నవ మాసాలు మోసి బిడ్డలకు జన్మనిస్తున్న తల్లులు ప్రస్తుత సమాజంలో దిక్కులేని చావులు చస్తున్నారు. అంత దారుణంగా బిడ్డలు.. జన్మనిచ్చిన తల్లిదండ్రులను చూసే పరిస్థితుల్లో ప్రమాదకరమైన సమాజం మారిపోయింది. బిడ్డలని ప్రయోజకులగా మారిస్తే పెళ్లయిన తర్వాత… వృద్ధాప్యంలో వచ్చిన తల్లిదండ్రులను చూసుకోవలసిన పరిస్థితిలో… వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నారు. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉండాల్సిన ప్రేమానురాగాలు.. రోజు రోజుకి దిగజారి పోతున్నయి. ముఖ్యంగా డబ్బు కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగాట్టడానికి మనిషి మారిపోతున్నాడు. ఈ క్రమంలో ప్రాణాలను కూడా తీయటానికి లెక్క చేయడం లేదు. తాజాగా ఈ రకంగానే.. కామారెడ్డిలో డబ్బుల కోసం కన్నతల్లి మృతదేహాన్ని అనాధగా వదిలేశారు.
డబ్బులు ఇస్తేనే అంత్యక్రియలు నిర్వహిస్తామంటూ… కడసారి చూపుకు రానంత కఠినంగా వ్యవహరించారు కన్నబిడ్డలు. బిడ్డలను కని పెంచి, పోషించిన తల్లి డబ్బులు ఇవ్వలేదని… కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దిక్కులేని శవంగా పడి ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా ఆర్బీనగర్ కి చెందిన 70 ఏళ్ల కిష్టవ్వ ముగ్గురు… కూతుళ్లు ఒక కొడుకు ఉండేవాళ్ళు. కిష్టవ్వ.. నలుగురు పిల్లలు చిన్నప్పుడే భర్త చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఎంతో కష్టపడి నలుగురు పిల్లలకు పెళ్లి చేయడం జరిగింది. అయితే కొన్నాళ్లకు పెళ్లి అయినా కొడుకు చనిపోయాడు ఆ తర్వాత కోడలు కూడా మరణించింది. అనంతరం రెండో కూతురు భర్తను విడిచిపెట్టి తన దగ్గరికి రావడం జరిగింది. ఈ క్రమంలో ఎన్నో కష్టాలు పడి చివరగారికి బిక్షం ఎత్తుకునే పరిస్థితి వచ్చింది.
భర్తను విడిచిపెట్టి వచ్చిన కూతురు కూడా మరణించడంతో ఎంతో అనారోగ్యానికి గురైన కిష్టవ్వనీ మిగతా ఇద్దరు కూతుర్లు.. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఈ క్రమంలో చికిత్స జరుగుతున్న సమయంలో ఇద్దరు కూతుర్లు డబ్బు కోసం తల్లితో గొడవ పడటం జరిగింది. కిష్టవ్వనీ బ్యాంక్ అకౌంటు లో ఉన్న డబ్బులను తీసేసి తమకు ఇచ్చేయాలని నానా రాద్ధాంతం చేయడం జరిగింది. దానికి తల్లి నిరాకరించటంతో ఆమెపై దాడి చేసి వెళ్లిపోయారు. ఈ క్రమంలో కిష్టవ్వ.. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడవటం జరిగింది. ఈ విషయాన్ని హాస్పిటల్ సిబ్బంది కిష్టవ్వ కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అయితే తమ దగ్గర డబ్బులు లేవని తల్లి దగ్గర డబ్బులు ఉంటేనే.. అంత్యక్రియలు నిర్వహిస్తామని.. హాస్పిటల్స్ సిబ్బందికి ఫోన్ లో బదులు ఇవ్వడం జరిగిందట. ఈ క్రమంలో పోలీసులు కావటంతో పరిస్థితిని డిలీట్ చేయడం జరిగింది అంట.
https://youtu.be/w4j_dqeX1ZI