Own House : మీకు సొంతిల్లు ఉందా.. అయితే కుటుంబానికి రూ.78వేల రూపాయ‌లు.. ఎలా అంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Own House : మీకు సొంతిల్లు ఉందా.. అయితే కుటుంబానికి రూ.78వేల రూపాయ‌లు.. ఎలా అంటే..!

 Authored By ramu | The Telugu News | Updated on :4 August 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Own House : మీకు సొంతిల్లు ఉందా.. అయితే కుటుంబానికి రూ.78వేల రూపాయ‌లు.. ఎలా అంటే..!

Own House : కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌లో వెలుగులు నింపాల‌ని భావిస్తున్నాయి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సూర్య శక్తిని వినియోగించి విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి గల అవకాశాలను పరిశీలించి నివేదిక ఇవ్వాల‌ని భావిస్తుంది. ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన కింద ప్రజల ఇళ్లకే కాకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా సూర్య ఫలకాలను ఏర్పాటు చేసి తద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకుంది. ఇలా చేయ‌డం వ‌ల‌న విద్యుత్ ఉత్ప‌త్తి పెర‌గ‌డ‌మే కాకుండా, ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కి వ‌చ్చే ల‌క్ష‌లాది రూపాయ‌ల విద్యుత్ బిల్లుల‌ని కూడా ఆదా చేసే అవ‌కాశం ఉంటుంది. సూర్య ఫలకాలను ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ఆయా ప్రభుత్వ కార్యాలయాలు వినియోగించుకోవచ్చును.

Own House లాభం ఇలా పొందండి..

ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన కింద విద్యుత్ వినియోగదారులు ఇళ్లమీద సూర్య ఫలకాలను అమర్చుకొని తద్వారా విద్యుత్ ఉత్ప‌త్తి చేసే అవ‌కాశం క‌ల్పించింది. ఈ క్ర‌మంలో కేంద్ర ప్రభుత్వం 90 శాతం రాయితీ ఇస్తుంది. ఒక కిలో వాట్ విద్యుత్ ఉత్పత్తికి 30,000 రూపాయలు, రెండు కిలోల వాట్ల విద్యుత్ ఉత్పత్తికి 60 వేల రూపాయలు, మూడు కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తికి 78 వేలను స‌బ్సీడీగా ఇస్తుండ‌డం శుభ‌ప‌రిణామం అని చెప్ప‌వ‌చ్చు. ఇది పొంద‌డానికి ఆసక్తి ఉన్న గృహ యజమానులు ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన వెబ్సైట్లోకి వెళ్లి తమ పేరును నమోదు చేసుకోవచ్చును. అలాగే సూర్య ఫలకాలను అమర్చి ఏజెన్సీల వివరాలు కూడా ఇందులో ఉంటాయి. తమకు నచ్చిన ఏజెన్సీని ఎంచుకోవచ్చును.. ట్రాన్స్ కో విభాగం అధికారులు సాంప్రదాయేతర ఇందన వనరుల అభివృద్ధి సంస్థ అధికారులు కలిసి ఇళ్లమీద సూర్యఫలకాలను ఏర్పాటు చేస్తారు.

Own House మీకు సొంతిల్లు ఉందా అయితే కుటుంబానికి రూ78వేల రూపాయ‌లు ఎలా అంటే

Own House : మీకు సొంతిల్లు ఉందా.. అయితే కుటుంబానికి రూ.78వేల రూపాయ‌లు.. ఎలా అంటే..!

ఇళ్లకు ప్రత్యేకమైన మీటర్లను విద్యుత్ శాఖ అధికారులు అమ‌ర్చ‌గా, ట్రాన్స్ కో ద్వారా ఎంత విద్యుత్తును వినియోగదారులు ఎంతవరకు ఉపయోగించుకున్నది తెలుసుకోవచ్చును. అలాగే సూర్య ఫలకాలను ద్వారా అదనంగా ఉత్పత్తి అయిన విద్యుత్తును ట్రాన్స్ కో అధికారులు కొనుగోలు చేస్తారు. ఈ మీటర్ల ద్వారా తమ ఎంత ట్రాన్స్ కో ఎంత విద్యుత్తును వినియోగించుకున్నది కూడా మ‌న‌కు అర్ధ‌మ‌వుతుంది. వినియోగదారులు ట్రాన్స్ కో కు సరఫరా చేసిన విద్యుత్తు యూనిట్లను తగ్గించి, వినియోగదారుడు వాడుకున్న విద్యుత్ కు బిల్లులను అందజేయ‌డం ద్వారా నియోగదారులకు భారీగా విద్యుత్ బిల్లులు ఆదా అవుతుంది .

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది