PAN – Aadhaar Link : పాన్ కార్డు, ఆధార్ లింక్ చేసుకున్నారా? మార్చి 31 లోపు చేసుకోకపోతే మీకే నష్టం
PAN – Aadhaar Link : నకిలీ కార్డుల బెడద నుంచి తప్పించడానికి.. నకిలీ కార్డుల పేరుతో జరిగే మోసాలను అరికట్టడానికి ఆధార్ కార్డులను పాన్ కార్డుతో లింక్ చేయించుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. చాలా రోజుల నుంచి ఆధార్, పాన్ లింక్ చేసుకోవాలని చెబుతున్నప్పటికీ చాలామంది ఇంకా లింక్ చేసుకోలేదు. కొందరు వాటిని ఎలా లింక్ చేసుకోవాలో తెలియక లింక్ చేసుకోకపోవడం ఒకటి అయితే.. మరికొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, సమయం లేక లింక్ చేయించుకోలేదు.
కానీ..అప్పుడే మార్చి వచ్చేసింది. మార్చి 31, 2023 లోపూ పాన్, ఆధార్ ను లింక్ చేసుకోవాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ లింక్ చేసుకోవాల్సిందే.ఇన్ కమ్ టాక్స్ యాక్ట్ 1961 లోని 139 ఏఏ ప్రకారం ఆధార్, పాన్ కార్డును లింక్ చేసుకోవాలి. లేదంటే.. 2023, ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డు పనిచేయదు. ఆధార్ తో లింక్ చేసిన పాన్ కార్డ్స్ మాత్రమే ఏప్రిల్ 1 నుంచి యాక్టివ్ లో ఉంటాయి. దాని గురించి ఇటీవలే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట టాక్సెస్(సీబీడీటీ) సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
PAN – Aadhaar Link : ఆధార్, పాన్ లింక్ ఎలా చేసుకోవాలి?
ఆధార్ కార్డుతో పాన్ ను ఎలా లింక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దాని కోసం రెండు మూడు రకాల పద్ధతులు ఉన్నాయి. అందులో ఒకటి ఎస్ఎంఎస్ పద్ధతి. దాని కోసం UIDPAN అని మెసేజ్ టైప్ చేసి మీ ఆధార్ నెంబర్, పాన్ నెంబర్ టైప్ చేసి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 56161 లేదా 567678 నెంబర్ కు మెసేజ్ చేయండి. ఆధార్, పాన్ లింక్ కాగానే లింక్ అయినట్టుగా కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.
అలా కాకుండా పోర్టల్ లోనూ పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేసుకోండి. దాని కోసం https://incometaxindiaefiling.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ఫైలింగ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకోవాలి. పాన్ కార్డు నెంబరే యూజర్ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్ పాస్ వర్డ్. యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యాక అక్కడ ఆధార్, పాన్ కార్డు లింక్ కోసం ఒక ప్రాంప్టింగ్ విండో కనిపిస్తుంది. లింక్ ఆధార్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే చాలు.. ఆధార్ తో పాన్ కార్డు లింక్ అవుతుంది.