Panasa Buttalu Recipe : పాతకాలం నాటి ఎంతో రుచికరమైన ,ఆరోగ్యకరమైన పనస బుట్టలు ఈ విధంగా ట్రై చేయండి..!
Panasa Buttalu Recipe : పనస బుట్టలు అంటే అందరికీ తెలిసి ఉండదు. ఎందుకంటే ఇది పాతకాలం నాటి వంటకం. ఇవి నూనె లేకుండా ఆవిరి మీద చేసే తెలుగువారి సంప్రదాయ వంటకం. అలాగే దీని కాంబినేషన్ స్పైసీగా నువ్వుల పచ్చడి తయారు చేసుకుందాం.. వీటికోసం కావలసిన పదార్థాలు: మెంతులు ,ధనియాలు, నువ్వులు ,జీలకర్ర, ఆయిల్, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, ఉప్పు, బెల్లం చింతపండు, ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, పసుపు, మినప గుండ్లు, బియ్యం రవ్వ, పనసాకులు మొదలైనవి… ముందుగా పనస బుట్టలకి కావలసిన స్పైసి చట్నీ కోసం, స్టవ్ పై ఒక పాన్ పెట్టుకుని దానిలో ఒక కప్పు నువ్వులు, కొంచెం మెంతులు, ఒక రెండు స్పూన్లు ధనియాలు వేసి ఎర్రగా వేయించుకోవాలి.
కొంచెం జీలకర్ర కూడా వేసి వేయించి తీసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత అదే పాన్ లో కొంచెం ఆయిల్ వేసి ఒక పది ఎండు మిరపకాయలు తుంపి వేసి వేయించుకొని తీసుకోవాలి. ఇక ముందుగా వేయించుకున్న నువ్వుల తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పొడిలా పట్టి తర్వాత దానిలో వేయించుకున్న మిరపకాయలను వేసి దానిలో నాలుగైదు రెబ్బల ఎల్లిపాయలు కూడా వేసి దానిలో కొంచెం చింతపండు రసం, కొంచెం బెల్లం, కొన్ని నీళ్లు, సరిపడినంత ఉప్పు వేసి మెత్తని చట్నీల పట్టుకోవాలి. తర్వాత దీనిని పోపు పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఇక ఇప్పుడు పనస బుట్టల తయారీ విధానం: ముందుగా నైట్ మొత్తం నానబెట్టుకున్న మినప గుండ్లని మిక్సీ జార్ లో వేసి గట్టిగా పట్టుకోవాలి.

Panasa Buttalu Recipe video in Telugu
తర్వాత ఈ పిండిలోకి బియ్యపు రవ్వను తీసుకొని కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత పనస ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగి వాటిని చిన్న పుల్లల సహాయంతో బుట్ట లాగా తయారు చేసుకోవాలి. తర్వాత స్టౌ పై ఇడ్లీ కుక్కర్ను పెట్టి దానిలో నీళ్లు పోసి రెండు పాత్రలు మాత్రమే దానిలో ఉంచి నీళ్ళని కాగనివ్వాలి. ఇక తర్వాత ఆ బుట్టలలో మన ముందుగా చేసి పెట్టుకున్న ఇడ్లీ మిశ్రమాన్ని వేసుకోవాలి. తర్వాత ఆ బుట్టలని ఇడ్లీ పాత్రలో పెట్టి 15 నిమిషాల వరకు ఉంచి ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆపి ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచి తర్వాత తీసి ముందుగా చేసి పెట్టుకున్న చట్నీతో సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో రుచికరమైన బుట్టలు నువ్వుల చట్నీ రెడీ.
