Categories: andhra pradeshNews

Swachha Ratham : ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. స్వచ్ఛ రథాలు వచ్చేసాయోచ్.. అసలు వీటివల్ల ఉపయోగాలు ఏంటి..?

Swachha Ratham : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ పరిశుభ్రతను పెంపొందించేందుకు కొత్త ప్రయోగంగా ‘స్వచ్ఛ రథం’ అనే పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజల మౌలిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన ఈ కాన్సెప్ట్‌కు మంచి స్పందన లభిస్తోంది. గుంటూరు జిల్లాలోని లాల్‌పురం గ్రామంలో ఈ రథాన్ని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు జూలై 10న ప్రారంభించారు. గ్రామాల్లో చెత్తను సేకరించి, వాటిని రీసైకిల్ చేయడం ద్వారా పరిశుభ్రతను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ ప్రాజెక్టు ముందుకు సాగుతోంది.

ఈ స్వచ్ఛ రథంలో తడి చెత్త (ఆర్గానిక్), పొడి చెత్త (రీసైక్లబుల్) వేరు వేరుగా సేకరిస్తారు. తడి చెత్తను ప్రతి రోజూ, పొడి చెత్తను వారంలో రెండు సార్లు సేకరించడానికి వాహనాలు వస్తాయి. గ్రామస్తులు తమ ఇంట్లో ఉండే చెత్తను వేరు చేసి ఈ వాహనాలకు అందిస్తారు. అందుకు బదులుగా కిరాణా సరుకులు తీసుకునే అవకాశం ఉంటుంది. చెత్తకు కూడా విలువ కల్పిస్తూ, ఉపయోగపడే పదార్థాలపై ధరను నిర్ణయించి ప్రజలకు నష్టంలేకుండా మేలుచేస్తున్నారు. చెత్తతో వ్యాపారం అనే కాన్సెప్ట్‌ గ్రామస్తులకు నచ్చుతోందన్న మాట.

Swachha Ratham : ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. స్వచ్ఛ రథాలు వచ్చేసాయోచ్.. అసలు వీటివల్ల ఉపయోగాలు ఏంటి..?

సేకరించిన తడి చెత్తను కంపోస్టింగ్ చేసి జైవ ఎరువుగా, పొడి చెత్తను రీసైక్లింగ్ కంపెనీలకు పంపించి పునఃప్రాసెసింగ్ చేస్తున్నారు. దీనివల్ల పర్యావరణానికి హాని లేకుండా, చెత్తను సంపదగా మార్చే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఇది స్వచ్ఛ భారత్ మిషన్ భాగంగా పనిచేస్తోంది. గ్రామీణ ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెరుగుతుంది. ఒకప్పటి వైసీపీ హయాంలో ఉన్న ఖాళీ రేషన్ బండ్లను ఈ స్వచ్ఛ రథాలుగా మార్చే అవకాశం ఉందన్న ప్రచారం కూడా ఉంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం గ్రామీణ అభివృద్ధికి దోహదపడుతుండగా, సీఎం చంద్రబాబు అభిప్రాయాలను ప్రతిబింబిస్తోంది.

Recent Posts

OG | ‘ఓజీ’ టికెట్ రేట్ల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం.. ఇక నుండి పెంపు ఉండ‌దు

OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…

10 minutes ago

Coconut | కొబ్బరి తినడం మంచిదేనా.. ఇందులో దాగిన‌ అపాయం ఏంటో తెలుసా?

Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…

1 hour ago

Jackfruit seeds | వైరస్‌లకు చెక్ పెట్టే పనస గింజలు.. రోగనిరోధక శక్తి పెంచే ఆరోగ్య రహస్యం ఇదే!

Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…

2 hours ago

Tulsi Leaves | తులసి నీరు ఆరోగ్యానికి చాలా ఉప‌యోగం.. నిపుణులు చెబుతున్న అద్భుత ప్రయోజనాలు

Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…

3 hours ago

Garlic Peel Benefits | వెల్లుల్లి తొక్కలు పనికిరానివి కావు. .. ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు

Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…

4 hours ago

Health Tips | బరువు తగ్గాలనుకుంటున్నారా? గ్రీన్ టీ బెటరా? మోరింగ టీ బెటరా?

Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…

5 hours ago

Diwali | దీపావళి 2025: ఖచ్చితమైన తేదీ, శుభ సమయం, పూజా విధానం ఏంటి?

Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…

6 hours ago

Whats App | వాట్సాప్‌లో నూతన ఫీచర్ .. ఇకపై ఏ భాషలోనైనా వచ్చిన మెసేజ్‌ను సులభంగా అర్థం చేసుకోవచ్చు!

Whats App | ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) వినియోగదారులకు శుభవార్త చెప్పింది. భాషల మధ్య బేధాన్ని తొలగించేందుకు…

15 hours ago