Viral Video : ఒరేయ్.. నువ్వు మనిషివేనా? పానీపూరి రసంలో మూత్రం పోశాడు.. ఛీ.. యాక్.. వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : ఒరేయ్.. నువ్వు మనిషివేనా? పానీపూరి రసంలో మూత్రం పోశాడు.. ఛీ.. యాక్.. వీడియో

 Authored By jagadesh | The Telugu News | Updated on :23 August 2021,6:30 am

Viral Video : మీరు ఎప్పుడైనా పానీపూరి తిన్నారా? ఎందుకు తినలేదు.. బయటికి వెళ్తే చాలు.. లొట్టలేసుకుంటూ తింటాం.. అంటారా? అయితే.. ఈ వీడియో చూస్తే.. ఇక జన్మలో మీరు పానీపూరి తినరు. అస్సలు ముట్టుకోరు కూడా. నిజానికి.. పానీపూరి అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు. బయట పానీపూరి బండి కనిపిస్తే చాలు.. మనసు లాగుతుంది. నోరు ఊరుతుంది. వెంటనే ఆగలేక.. ఇక పానీపూరిని లాగించేస్తాం. కాస్త కారంకారంగా.. ఉప్పుగా.. స్పైసీగా ఉండేసరికి.. కాస్త పానీపూరి నీళ్లను కూడా జుర్రుతాం. దీంతో నోరంతా.. స్పైసీగా అవుతుంది. అబ్బ.. పానీపూరి టేస్టే వేరప్పా అంటారు.

panipuri seller mixes urine in pani puri water in guwahati video viral

panipuri seller mixes urine in pani puri water in guwahati video viral

కానీ.. పానీపూరి అమ్ముకునే ఓ వ్యక్తి చేసిన పని చేస్తే.. మీరు ఇక జన్మలో పానీపూరిని తినరు. ఇంతకీ ఆ వ్యక్తి ఏం చేశాడంటారా? పాడు పని చేశాడు. పానీపూరి బండి దగ్గర యాప్రాన్ వేసుకున్నాడు. ఓ మగ్గు పట్టుకున్నాడు. యాప్రాన్ లోపల మగ్గు పెట్టాడు. జిప్ తీశాడు. ఆ మగ్ లో మూత్రం పోశాడు. ఆ తర్వాత ఆ మగ్గులో ఉన్న మూత్రాన్ని పానీపూరి నీళ్లలో కలిపేశాడు.

panipuri seller mixes urine in pani puri water in guwahati video viral

panipuri seller mixes urine in pani puri water in guwahati video viral

Viral Video : అటునుంచి వెళ్తున్న వ్యక్తి వీడియో రికార్డు చేయడంతో బయటపడ్డ అతడి బాగోతం

అయితే.. ఓ వ్యక్తి అదే సమయంలో అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. మనోడు చేస్తున్న పాడు పని చూసి.. వెంటనే తన ఫోన్ ఆన్ చేసి వీడియో రికార్డు చేసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో చేసిన నెటిజన్లు.. పానీపూరి అమ్మే వ్యక్తిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఛీ.. ఇదేం పని. ఇంత ఘోరంగా తయారు అయ్యారు ఏంటి? ఇంత నీచానికి దిగజారారు ఏంటి? ఇటువంటి వ్యక్తిని పోలీసులకు అప్పగించాలి. కఠినంగా శిక్షించాలి. ఇటువంటి వాళ్ల వల్లే… నిజాయితీగా ఎంతో నాణ్యతతో చిరు తిండి అమ్ముకునే వ్యాపారులను కూడా ప్రజలు నమ్మడం లేదు.. అంటూ నెటిజన్లు మాత్రం విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు. అయితే.. ఆ పని చేసిన పానీపూరి నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేసి.. అతడి మీద కేసు కూడా నమోదు చేశారట. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా? అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది