Viral Video : మీరు ఎప్పుడైనా పానీపూరి తిన్నారా? ఎందుకు తినలేదు.. బయటికి వెళ్తే చాలు.. లొట్టలేసుకుంటూ తింటాం.. అంటారా? అయితే.. ఈ వీడియో చూస్తే.. ఇక జన్మలో మీరు పానీపూరి తినరు. అస్సలు ముట్టుకోరు కూడా. నిజానికి.. పానీపూరి అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు. బయట పానీపూరి బండి కనిపిస్తే చాలు.. మనసు లాగుతుంది. నోరు ఊరుతుంది. వెంటనే ఆగలేక.. ఇక పానీపూరిని లాగించేస్తాం. కాస్త కారంకారంగా.. ఉప్పుగా.. స్పైసీగా ఉండేసరికి.. కాస్త పానీపూరి నీళ్లను కూడా జుర్రుతాం. దీంతో నోరంతా.. స్పైసీగా అవుతుంది. అబ్బ.. పానీపూరి టేస్టే వేరప్పా అంటారు.
కానీ.. పానీపూరి అమ్ముకునే ఓ వ్యక్తి చేసిన పని చేస్తే.. మీరు ఇక జన్మలో పానీపూరిని తినరు. ఇంతకీ ఆ వ్యక్తి ఏం చేశాడంటారా? పాడు పని చేశాడు. పానీపూరి బండి దగ్గర యాప్రాన్ వేసుకున్నాడు. ఓ మగ్గు పట్టుకున్నాడు. యాప్రాన్ లోపల మగ్గు పెట్టాడు. జిప్ తీశాడు. ఆ మగ్ లో మూత్రం పోశాడు. ఆ తర్వాత ఆ మగ్గులో ఉన్న మూత్రాన్ని పానీపూరి నీళ్లలో కలిపేశాడు.
అయితే.. ఓ వ్యక్తి అదే సమయంలో అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. మనోడు చేస్తున్న పాడు పని చూసి.. వెంటనే తన ఫోన్ ఆన్ చేసి వీడియో రికార్డు చేసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో చేసిన నెటిజన్లు.. పానీపూరి అమ్మే వ్యక్తిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఛీ.. ఇదేం పని. ఇంత ఘోరంగా తయారు అయ్యారు ఏంటి? ఇంత నీచానికి దిగజారారు ఏంటి? ఇటువంటి వ్యక్తిని పోలీసులకు అప్పగించాలి. కఠినంగా శిక్షించాలి. ఇటువంటి వాళ్ల వల్లే… నిజాయితీగా ఎంతో నాణ్యతతో చిరు తిండి అమ్ముకునే వ్యాపారులను కూడా ప్రజలు నమ్మడం లేదు.. అంటూ నెటిజన్లు మాత్రం విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు. అయితే.. ఆ పని చేసిన పానీపూరి నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేసి.. అతడి మీద కేసు కూడా నమోదు చేశారట. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా? అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.