రాజకీయాల్లో రాణించాలంటే ముందు కావాల్సింది మాటకారితనం. అవును.. ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా సరే.. ప్రజలను మైమరిపించేలా మాట్లాడాలి. వాళ్ల ప్రజలకు సమాధానం చెప్పేలా ఉండాలి. ఇతర రాజకీయ నాయకులు వేలెత్తి చూపించకుండా.. వాళ్లకు గట్టి సమాధానం చెప్పేంత రేంజ్ ఉండాలి. లేకపోతే.. రాజకీయాల్లో రాణించడం కష్టం. తొక్కేస్తారు. పెద్ద పెద్ద రాజకీయ నేతల వారసులు చాలామంది రాజకీయాల్లో రాణించలేకపోవడానికి ప్రధాన కారణం అదే. మాటకారులు కాకపోవడమే. ఎంత టాలెంట్ ఉన్నా.. నలుగురిని మెప్పించేలా మాట్లాడకపోతే వేస్ట్.
రాజకీయ వారసత్వం ఉన్నప్పటికీ.. నలుగురిలో మాట్లాడలేక తడబాటు పడుతారు టీడీపీ నేత నారా లోకేశ్. ఆయన చాలాసార్లు మాట్లాడుతూ తడబడ్డారు. జనాల ప్రశ్నలకు సరిగ్గా సమాధానాలు ఇవ్వలేకపోయారు. ఎన్నోసార్లు ఆయన ప్రసంగంలో తప్పులు దొర్లాయి. నారా లోకేశ్ ను నిఖార్సయిన రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దడం కోసం చంద్రబాబు చేయని పని లేదు. ఎంతో ట్రెయినింగ్ ఇప్పించినప్పటికీ.. నారా లోకేశ్ కు మాత్రం రాజకీయ పరిణతి రావడం లేదు.. అనే వార్తలూ వినిపిస్తున్నాయి.
ఈనేపథ్యంలో టీడీపీ పార్టీకే చెందిన మరో యువ నేత పరిటాల శ్రీరామ్ ప్రస్తుతం లైమ్ లైట్ లోకి వచ్చాడు. ఆయన పరిటాల రవి కొడుకు. రవి తర్వాత శ్రీరామే వాళ్ల రాజకీయ వారసుడు. ఇప్పటికే తన తల్లి పరిటాల సునీత.. టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో శ్రీరామ్.. టీడీపీ నుంచి పోటీ చేసినప్పటికీ.. ఓడిపోయాడు. అప్పటి నుంచి పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. కానీ.. తాజాగా సాగునీటి వసతి కార్యక్రమంలో పరిటాల శ్రీరామ్ పాల్గొనాల్సి వచ్చింది. ఈసందర్భంగా ఆయన చేసిన ప్రసంగం ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల్లో ఓడిపోయాక.. ఇప్పటి వరకు బయటికి రాని శ్రీరామ్.. ఇప్పుడు బయటకు వచ్చి అద్భుతంగా ప్రసంగించడంతో.. యువ రాజకీయ నాయకుడయిన లోకేశ్ కు శ్రీరామ్ పోటీ వస్తున్నాడు.. అంటూ టీడీపీ శ్రేణుల్లో చర్చ సాగుతోంది. చూద్దాం మరి.. పరిటాల శ్రీరామ్ టీడీపీలో హైలెట్ అవుతాడా? అవ్వడా? అని
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.