parties distributing money in huzurabad by elections
Huzurabad bypoll : హుజూరాబాద్ ఉపఎన్నిక ఎవరికి లాభం చేస్తుందో చేయదో కానీ.. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఓటర్లకు మాత్రం పండుగ రోజులను తీసుకొచ్చింది. వాళ్లకు పెద్ద జాక్ పాట్ తగిలినట్టయింది. హుజూరాబాద్ ఉపఎన్నిక పుణ్యమాని.. ఇప్పుడు హుజూరాబాద్ ఓటర్లు.. అన్ని పార్టీలకు దేవుళ్లు అయ్యారు. ఇవాళ్టి వరకు ఉపఎన్నిక కోసం ప్రచారం జరిగింది. దీంతో ఓటరు దేవుడిని తమ మాటలతో, హామీలతో ప్రసన్నం చేసుకున్నారు అన్ని పార్టీల నేతలు.ఇక.. ఎన్నికల ప్రచారం ముగియడంతో మరో ప్రలోభానికి తెర లేపారు. ఎన్నికలకు ఇంకా రెండు రోజులే సమయం ఉండటంతో ఉదయం నుంచే ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయడం ప్రారంభించాయి అన్ని పార్టీలు. నిజానికి.. హుజూరాబాద్ లో పోటీ చేస్తున్న అన్ని పార్టీలకు ఓటర్లకు డబ్బులు పంచుతున్నాయని తెలిసినప్పటికీ..
parties distributing money in huzurabad by elections
అధికార టీఆర్ఎస్ పార్టీ ఒక్కో ఓటరుకు 6 వేల రూపాయలు ఇస్తున్నట్టుగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.టీఆర్ఎస్ పార్టీ ఒక్కో ఓటుకు 6 వేలు పంచుతున్నట్టుగా కొన్ని వీడియోల్లో చూపిస్తున్నారు. అది నిజమా? కాదా? అనేది తెలియనప్పటికీ.. హుజూరాబాద్ లో డబ్బులు మాత్రం కుప్పలు కుప్పలుగా పంచుతున్నట్టు తెలుస్తోంది. అన్ని పార్టీలు వేలకు వేలు ఓటర్లకు ఇచ్చి తమ పార్టీకే ఓటేయాలంటూ కోరుతున్నాయని తెలుస్తోంది.
నిన్నటి వరకు మద్యం పంపిణీ చేసి.. తాజాగా ఒక్క ఓటుకు కవర్ లో కోడ్ నెంబర్ వేసి.. ఆరు వేల రూపాయల నగదును పెట్టి పంచుతున్నారు.ఇదిగో ఆరువేలు.. కారు గుర్తు. గెల్లు శ్రీనివాస్ యాదవ్.. అంటూ ఓ వ్యక్తి హిందీలో మాట్లాడుతూ హుజూరాబాద్ ఓటర్ కు డబ్బులు ఇస్తున్నట్టుగా ఉన్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ప్రచారం తారా స్థాయికి చేరుకోవడంతో టీఆర్ఎస్ మరో ఎత్తుగడ. ఎన్వలప్ కవర్ లో డబ్బులు పంచుతున్న టీఆర్ఎస్ పార్టీ.. ఇదిగో సాక్ష్యం అంటూ సాయికిరణ్ 935 అనే యూజర్ ట్విట్టర్ లో ఈ వీడియోను పోస్ట్ చేశాడు.
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
This website uses cookies.