Pawan kalyan : పవన్ కల్యాణ్ కి భారీ హ్యాండ్ ఇచ్చిన బీజేపీ – కల్లో కూడా ఊహించి ఉండడు !
Pawan kalyan : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా అంటే చాలా చాలా సమయం ఉంది. కాని ఇప్పటి నుండే ఎన్నికలకు పార్టీలు సమాయత్తం అవ్వడం కనిపిస్తుంది. అధికార వైకాపా నుండి మొదలుకుని ప్రతిపో టీడీపీ నాయకుల వరకు ప్రతి ఒక్కరు కూడా వచ్చే ఎన్నికల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం అంటున్నారు. ఇక మద్యలో బీజేపీ మరియు జనసేన పార్టీలు కూడా పొత్తుతో అధికార పార్టీని ఢీ కొట్టాలని చూస్తున్నాయి. ఇలా భారీ ఎత్తున రాజకీయాలు ఏపీలో కొనసాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఏం జరుగబోతుందో ఏం అర్థం కావడం లేదు. ప్రభుత్వ వ్యతిరేకత వచ్చి తెలుగు దేశం పార్టీ వైపు లేదా బీజేపీ జనసేన కూటమి వైపు జనాలు అడుగులు వేస్తారా అనే అనుమానాలు కనిపిస్తున్నాయి. ఒక వేళ బీజేపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ కళ్లు మూసుకుని సీఎం పీఠంపై కూర్చోవడం ఖాయం అంటూ జనసైనికులు భావించారు. కాని బీజేపీ మాత్రం సీఎం అభ్యర్థి విషయంలో షాకింగ్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.
Pawan kalyan : జనసైనికులు ఆగ్రహం…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గతంలో మా కూటమి సీఎం అభ్యర్థి పవన్ అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు. కాని ఇప్పుడు మాత్రం ఆయన బీసీ వర్గంకు చెందిన వ్యక్తిని సీఎంగా చేయాలని భావిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. ఎన్నికలు ఇంకా చాలా కాలం ఉండగానే బీజేపీ సీఎం అభ్యర్థి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది అంటూ జనసైనికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను సీఎంగా చేస్తేనే బీజేపీతో కలిసి పని చేసేది అంటూ ఆ పార్టీ నాయకులు ఇప్పటి నుండే సోము వీర్రాజుకు సున్నితంగా చెబుతున్నారు.
ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం…
ఏపీలో బీజేపీ బీసీ ఓట్లను దక్కించుకునేందుకు సోము వీర్రాజు ప్లాన్ అని, సీఎం అభ్యర్థి విషయం ఇప్పుడు అప్రస్తుతం. ఆయన ఏదో జనాలను మబ్య పెట్టడం కోసమే అలాంటి వ్యాఖ్యలు చేశాడు తప్ప అంతకు మించి మరేం లేదు అన్నట్లుగా కొందరు బీజేపీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బీసీ ఓటర్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో బీజేపీ ఇప్పుడిప్పుడే బలం పుంజుకుంటుంది. అందుకే బీసీ సీఎం అంటూ ప్రకటన చేస్తే పార్టీకి మరింత బూస్ట్ లభిస్తుందనే ఉద్దేశ్యంతో ఆయన అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని రాజకీయ వర్గాల వారు కూడా అంటున్నారు. ఇక సీఎం అభ్యర్థి గురించి ఇప్పటి నుండే మాట్లాడుకోవడం మరీ అతి అవుతుందని కొందరు బీజేపీ జనసేన నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.