#image_title
Pawan Kalyan | నేడు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టినరోజు కావడంతో సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు శుభాకాంల వర్షం కురిపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు.తన తమ్ముడు పవన్‌తో కలిసి ఉన్న ఒక పాత ఫొటోను పంచుకున్న చిరంజీవి, హృదయపూర్వక సందేశాన్ని పోస్ట్ చేశారు.
#image_title
సెలబ్రిటీల విషెస్..
“సినిమా రంగంలో అగ్ర నటుడిగా, ప్రజా జీవితంలో జనసేన నాయకుడిగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా నిరంతరం ప్రజలకు సేవ చేస్తున్న కల్యాణ్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు” అని చిరంజీవి పేర్కొన్నారు. “ప్రజాసేవలో నువ్వు చూపిస్తున్న అంకితభావం మరువలేనిది. ప్రజలందరి ఆశీస్సులతో, ఆప్యాయతతో సంపూర్ణ ఆరోగ్యంతో నూరేళ్లు జీవించి, ప్రజలకు మార్గనిర్దేశకుడిగా నిలవాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను” అంటూ మెగాస్టార్ తన పోస్టులో రాసుకొచ్చారు.
అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా పవన్ కల్యాణ్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. పవన్ తో కలిసి సంతోషంగా నవ్వులు చిందిస్తున్న ఒక ఫొటోను ఆయన షేర్ చేశారు. ఈ పోస్టుకు “మా పవర్‌స్టార్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు” అంటూ క్యాప్షన్ జోడించారు. ప్రస్తుతం ఈ ఇద్దరు అగ్ర హీరోలు పెట్టిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు, దేశ ప్రధాని మోదీతో పాటు లోకేష్, ఇతర ప్రముఖులు కూడా పవన్‌కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Huge Relief for KCR : తెలంగాణ హైకోర్టు కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ పీసీ…
BSNL | ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) మరోసారి ఆకర్షణీయమైన డేటా ప్లాన్‌లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ప్రైవేట్…
Pawan- Bunny | ఇండియన్ సినిమా అభిమానుల మధ్య హీరోల గురించి వాదనలు, గొడవలు, ట్రోలింగ్‌లు కొత్త విషయం కాదు.…
KCR suspends daughter K Kavitha from BRS : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ బీఆర్ఎస్ పార్టీ కీలక…
KCR | తెలంగాణ హైకోర్టు కీలక తీర్పుతో మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నేత హరీష్ రావులకు తాత్కాలిక ఊరట…
OG | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా…
Turmeric | మన వంటింట్లో నిత్యం కనిపించే పసుపు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఔషధగుణాలతో నిండి ఉంటుంది. పసుపులో ఉండే…
Chicken | ఆదివారం రాగానే వంటింట్లో సువాసనలతో చికెన్ వంట మొదలవుతుంది. నాన్ వెజ్ ప్రియుల భోజనాల్లో చికెన్‌కు ఒక…
This website uses cookies.