Pawan Kalyan : రెండో దశ వారాహి యాత్రలో దిగజారిపోయిన పవన్ స్పీచ్..!!
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న వారాహి విజయ యాత్ర గోదావరి జిల్లాలలో ముమ్మరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీకే నష్టం వాటిల్లేలా చేస్తున్నాయని టాక్. మొదటి దశ వారాహి విజయ యాత్రలో.. కన్స్ట్రక్టివ్ గా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై విమర్శలు చేసిన పవన్ రెండోదశ వారాహి యాత్రలో చేసిన కామెంట్లు.. మొత్తానికి పార్టీ గ్రాఫ్ పవన్ ఇమేజ్ దిగజారి పోయేలా చేసినట్లు ప్రచారం జరుగుతుంది.
ముఖ్యంగా వాలంటీర్ల వ్యవస్థ పై పవన్ చేసిన కామెంట్స్.. ఆ పార్టీకే నష్టం వాటిల్లేలా చేశాయని అంటున్నారు. మహిళల అక్రమ రవాణాకు వాలంటీర్లు పాల్పడుతున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు తనకు తెలియజేసినట్లు చెప్పుకొచ్చారు. దీంతో పవన్ చేసిన కామెంట్స్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. కనీసం ఆధారాలు లేకుండా.. ఎవరో చెప్పినట్లు.. ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న వాలంటీర్లపై చేసిన కామెంట్లు పవన్ పై దాదాపు కొత్త గొప్పో ప్రజలకు విసుగు కలిగించాయట. ఎందుకంటే కేవలం ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందజేయడంలో… ఇంకా మరి కొన్ని సమస్యలలో ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటున్న క్రమంలో…
పనిచేసే వారిపై పవన్ పసలేని ఆరోపణలు చేయటం అతని దిగజారుతనానికి నిదర్శనం అన్న పరిస్థితి నెలకొంది. రెండో దశ వారాహి యాత్రలో ముఖ్యమంత్రి జగన్ ని ఉద్దేశించి ఏకవచనంతో సంబోధిస్తూ.. చేసిన కామెంట్లు కేవలం జగన్ పై అసూయ.. అన్న రీతిలో మాత్రమే ప్రొజెక్ట్ అయిన పరిస్థితి నెలకొంది. గతంలో పవన్ మద్దతు తెలిపిన తెలుగుదేశం హయాంలో ఏమాత్రం ప్రశ్నించకుండా ఇప్పుడు ప్రజలకు కరోనా లాంటి కష్ట సమయాలలో కూడా పథకాలు ఆపకుండా.. ఇచ్చిన ప్రభుత్వం పై పవన్ ఇష్టానుసారంగా ఆరోపణలు చేయటం.. వల్ల చాలా వరకు జనసేనకే నష్టం వాటిల్లుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రెండో దశ వారాహి విజయ యాత్రలో ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు సభలలో పవన్ ప్రసంగతీరు చాలా వరకు దిగజారుతనానికి పడిపోయినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.