EPFO : పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే మీకు గుడ్ న్యూస్.. త్వరలో పెన్షన్ పెరగబోతోంది
EPFO : పీఎఫ్ అకౌంట్ ఉన్న వాళ్లకు త్వరలో ఓ గుడ్ న్యూస్ అందబోతోంది. అదేంటో తెలుసా? పీఎఫ్ అకౌంట్ పెన్షన్ త్వరలో పెరగబోతోంది. చాలా కాలం నుంచి పీఎఫ్ నుంచి వచ్చే పెన్షన్ ను పెంచాలంటూ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిజానికి.. పెన్షన్ పెంపునకు సంబంధించిన కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. అయితే. త్వరలోనే పీఎఫ్ పెన్షన్ పెరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.కార్మికుల కోసం కొత్త పెన్షన్ స్కీమ్ ను తీసుకురావాలని పీఎఫ్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
కొత్తగా తీసుకొచ్చే పెన్షన్ స్కీమ్ ప్రకారం ఉద్యోగి.. తనకు కావాల్సినంత పర్సంటేజ్ పీఎఫ్ కంట్రిబ్యూషన్ ను ఎంచుకోవచ్చు. సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ పొందే వ్యక్తులు కూడా ఈ కొత్త స్కీమ్ ద్వారా పీఎఫ్ ఖాతాతో చేరే అవకాశం ఉంటుంది.పెన్షన్ స్కీమ్ 1995 ప్రకారం.. ఉద్యోగి జీతంలోని బేసిక్ పే నుంచి 12 శాతాన్ని పీఎఫ్ కు జమ చేస్తారు. ఎంప్లాయర్ కూడా అదే 12 శాతం ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో జమ చేస్తాడు. అందులో 8.33 శాతం పెన్షన్ స్కీమ్ కిందికు వెళ్తుంది.
EPFO : పెన్షన్ పరిమితిని ఉద్యోగే ఎలా పెంచుకోవచ్చు?
పైన చెప్పుకున్నట్టుగా.. ఉద్యోగి ఎప్పుడైతే పీఎఫ్ కంట్రిబ్యూషన్ శాతాన్ని పెంచుకుంటాడో.. ఆటోమెటిక్ గా ఉద్యోగి వేతనం నుంచి పెన్షన్ కంట్రిబ్యూషన్, ఎంప్లాయర్ పీఎఫ్ డబ్బు నుంచి పెన్షన్ కంట్రిబ్యూషన్ పెరుగుతుంది. తద్వారా.. రిటైర్ అయిన తర్వాత ఎక్కువ డబ్బును నెల నెలా పెన్షన్ గా పొందొచ్చు అన్నమాట.