Heat Waves : ఆ జిల్లాలో దంచికొడుతున్న ఎండలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Heat Waves : ఆ జిల్లాలో దంచికొడుతున్న ఎండలు..!

 Authored By ramu | The Telugu News | Updated on :26 March 2025,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Heat Waves : ఆ జిల్లాలో దంచికొడుతున్న ఎండలు

Heat Waves : ఈసారి ఎండలు దంచికొడుతున్నాయి. మే లో కొట్టాల్సిన ఎండలు ఇప్పుడు మర్చి లోనే కొడుతుండడం తో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు భయపడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటె మే లో ఇంకెలా ఉంటాయో అని ఖంగారుపడుతున్నారు. ముఖ్యంగా ఏపీ ప్రజలను భయాందోళనకు గురిచేస్తూ ఎండలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. వేసవి ఇంకా పూర్తిగా రాని దశలోనే రోడ్ల మీద కాలినట్టుగా అనిపించే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉక్కపోతతో జనజీవనం అస్తావిస్తాం అవుతున్నారు. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు దాదాపు అన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాయలసీమ జిల్లాల్లో వడగాల్పులు విరుచుకుపడుతుండగా, మంగళవారం నంద్యాల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Heat Waves ఆ జిల్లాలో దంచికొడుతున్న ఎండలు

Heat Waves : ఆ జిల్లాలో దంచికొడుతున్న ఎండలు

Heat Waves మర్చి లోనే ఎంత ఎండలా..?

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వేడి గాలులు ప్రజలను మరింత ఇబ్బంది పెడుతున్నాయి. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ప్రకారం.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశముంది అని తెలిపింది. గురువారానికి కూడా ఈ పరిస్థితి కొనసాగుతుందని, మొత్తం 37 మండలాల్లో వేడిగాలులు వీచే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

అధిక ఉష్ణోగ్రతల వల్ల జబ్బులు, డీహైడ్రేషన్, వడదెబ్బలు వచ్చే ప్రమాదం ఉంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయటకి వెళ్లకుండా ఉండటం మంచిది. బయటికి వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తేలికపాటి దుస్తులు ధరించడం, చల్లటి ద్రవాలు తాగడం, ఎక్కువ సేపు నేరుగా ఎండలో ఉండకుండా ఉండటం వంటి జాగ్రత్తలు పాటించాలి. ప్రభుత్వ విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. వడదెబ్బకు గురైతే వెంటనే వైద్యుల సహాయం తీసుకోవాలని సూచిస్తున్నారు

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది