High Temperature : మరింతగా పెరిగిపోతున్న భానుడి తాపం… వందేళ్ల చరిత్రలో ఇదే తొలిసారి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

High Temperature : మరింతగా పెరిగిపోతున్న భానుడి తాపం… వందేళ్ల చరిత్రలో ఇదే తొలిసారి…!

 Authored By ramu | The Telugu News | Updated on :1 May 2024,8:10 pm

ప్రధానాంశాలు:

  •  High Temperature : మరింతగా పెరిగిపోతున్న భానుడి తాపం... వందేళ్ల చరిత్రలో ఇదే తొలిసారి...!

High Temperature : ఈ ఏడాది ఎండలు విపరీతంగా కొడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా భానుడు తన తాపంతో రికార్డు బ్రేక్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఎండలు దాటికి తట్టుకోలేక జనం బెంబేలెత్తిపోతున్నారు. ఏ ప్రాంతంలో చూసిన 44 నుండి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతూ వస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ , బీహార్ ,పశ్చిమబెంగాల్ ,ఒడిస్సా వంటిి రాష్ట్రాలలో విపరీతంగా పెరుగుతున్న ఎండల కారణంగా రెడ్ అలెర్ట్ కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే రాబోయే రెండు మూడు రోజుల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వడగాలులు ఎక్కువగా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇంట్లో నుండి బయటకు రావద్దని సూచిస్తున్నారు.

High Temperature : తెలంగాణలో ఆరెంజ్ అలెర్ట్…

ఇక తెలంగాణ ,సిక్కిం , కర్ణాటక వంటి రాష్ట్రాల విషయానికొస్తే ఈ ప్రాంతాలలో ఇప్పటికే ప్రభుత్వాలు ఆరంజ్ అలెర్ట్ ను ప్రకటించాయి. అంతేకాక ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఎండల తీవ్రత విపరీతంగా పెరగడం ఆందోళన కలిగిస్తుందని చెప్పాలి. దాదాపు 100 ఏళ్ల తర్వాత ఇలాంటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అంటే ఆలోచించదగ్గ విషయమేనని చెప్పాలి. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ అందిస్తున్న సమాచారం ప్రకారం 1921 తర్వాత 2024 కు ముందు సంవత్సరాలలో ఏ రోజు 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాలేదట. దాదాపు 100 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు అన్ని ప్రాంతాలలో దాదాపు 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. ఇక రానున్న 5 రోజుల్లో దేశవ్యాప్తంగా వాతావరణం మరింత వేడెక్కే అవకాశం ఉందని తేలుస్తోంది. అంతేకాక దేశంలోని తూర్పు మరియు దక్షిణ భాగాల్లో తీవ్రమైన వేడి గాలులు వీచే ప్రమాదం ఉన్నందున మే నెలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా చెబుతున్నారు.

High Temperature మరింతగా పెరిగిపోతున్న భానుడి తాపం వందేళ్ల చరిత్రలో ఇదే తొలిసారి

High Temperature : మరింతగా పెరిగిపోతున్న భానుడి తాపం… వందేళ్ల చరిత్రలో ఇదే తొలిసారి…!

High Temperature : వాతావరణ శాఖ సూచనలు…

అధికంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతను దృష్టిలో ఉంచుకొని వాతావరణ శాఖకొన్ని రకాల సూచనలను జారీ చేసింది. పర్యావరణ పరిరక్షణ చర్యలు తీసుకోకపోవడం వలనే భూతాపం విపరీతంగా పెరుగుతుందని , మంచు కొండలు కరిగిపోతున్నాయని ,హిమ నినాదాలు కనుమరుగవుతున్నాయట. దీని కారణంగానే భూతాపం అధికమవుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. కావున ఈ ఏడది ఎండలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు బయటికి రాకుండా ఉండటమే మంచిదిని చెబుతున్నారు. ఒకవేళ రావాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఇక ఈ సమయంలో నిత్యం నీటిని ఎక్కువగా తాగుతూ ఉండాలి. వదులుగా ఉండే దుస్తులు ధరించడం మంచిది. అదేవిధంగా నెత్తి మీద టోపీ , మొఖానికి తెల్లని గుడ్డ కట్టుకోవడం వలన ఎండ తగలకుండా రక్షించుకోవచ్చు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది