Beers : రాష్ట్రంలో నిలిచిన బీర్ల ఉత్పత్తి…. నీటి కొరతే కారణమా..!
ప్రధానాంశాలు:
Beers : రాష్ట్రంలో నిలిచిన బీర్ల ఉత్పత్తి.... నీటి కొరతే కారణమా..!
Beers : వేసవికాలం ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. మరోవైపు ఎన్నికల ప్రచారాలు జోరుగా కొనసాగుతున్నాయి. దీంతో ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రచారాలు చేస్తూ సాయంత్రానికి చల్లటి బీరు తాగి తీరాలని ప్రతిఒక్కరు అనుకుంటారు. కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మందుబాబులకు అలాంటి కిక్ దొరకడం లేదు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ కూడా బీర్లు దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో గత కొంతకాలంగా రాష్ట్రంలో బీర్ల కొరత ఏర్పడింది . ఇక బీర్లు అందుబాటులో లేకపోవడంతో మందుబాబులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగానే వేసవికాలంలో బీర్ల అమ్మకాలు ఎక్కువగా జరుగుతాయి . అయితే ఈ ఏడాది వేసవికాలంతోపాటు లోక్ సభ ఎన్నికలు మరియు ఐపీఎల్ సీజన్ కొనసాగుతున్నడంతో బీర్లకు మరింత డిమాండ్ పెరిగింది. ప్రతి ఒక్కరు కూడా బీరు తాగుతూ వాటిని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు.
Beers : డిమాండ్ ఉన్నప్పటికీ సప్లై లేదు…
అయితే ప్రస్తుతం బీర్ల అమ్మకాలకు విపరీతమైన డిమాండ్ ఉన్నప్పటికీ అధికారులు వాటిని అందించలేని పరిస్థితిలో ఉన్నట్లుగా చెబుతున్నారు. అంతేకాక ఈ ఏడాది మార్చి మరియు ఏప్రిల్ నెలలో బీర్ల అమ్మకాలు పెద్ద మొత్తంలో సాగాయి. ఇక ఇప్పుడు మే నెలలోఎండలు మరింత పెరగడంతో పెద్ద మొత్తంలో బీర్లు అమ్ముడు అవుతున్నాయి. కానీ వైన్స్ లో మాత్రం సరిపడా బీర్లు అందుబాటులో ఉండడం లేదు. దీంతో నిర్వాహకులు కూడా వైన్ షాప్స్ ముందు నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. ఇక స్టాక్ వచ్చిన రెండు గంటలోనే బీర్లని అమ్ముడు అవుతున్నాయని చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం బీర్లు చల్లగా లేకపోయినా పర్లేదు కానీ అందుబాటులో ఉంటే చాలు అంటూ మందుబాబులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Beers : నీటి కొరతే కారణమా…
అయితే ప్రస్తుతం రాష్ట్రంలో పెద్ద మొత్తంలో బీర్ల కొరత రాడానికి గల ముఖ్య కారణం నీటి కొరత అని తెలుస్తోంది. బీర్ల తయారు చేసే కేంద్రాలలో నీటి కొరత ఉండడంతో బీర్లు ఉత్పత్తి చేయలేకపోతున్నట్లుగా తయారీ కేంద్రాలు తెలియజేస్తున్నాయి. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో రిజర్వాయర్లలో నీటి లభ్యత లేకపోవడంతో ఈ ప్రభావం బీర్ల తయారీ కేంద్రాలపై కూడా పడినట్లుగా అర్థమవుతుంది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో ఒకపక్క నీటి కొరత కొనసాగుతుంటే మరో పక్క బీర్ల కొరత కొనసాగుతుంది.